రిక్షావాలా కూతురు మిస్ ఇండియా రన్నరప్.. ఈ స్టేజ్ కు చేరుకోవడానికి మాన్యాసింగ్ పడిన కష్టం.. కృషి తెలుసుకోవాల్సిందే..!

అందాల పోటీలు పేరు చెబితేచాలు చాలా ధనవంతులు ఈ పోటీల్లో పాల్గొంటారు అని అందరూ భావిస్తారు.. అయితే తాజాగా ఫెమినీ మిస్​ ఇండియా పోటీ ఫలితాలు ఓ యువతి తండ్రి కృషి పట్టుదలకు ప్రతీకగా నిలిచాయి. అవును విఎల్​సిసి ఫెమినీ మిస్​ ఇండియా పోటీల్లో ఆటో రిక్షా వాలా కూతురు మన్యా సింగ్...

రిక్షావాలా కూతురు మిస్ ఇండియా రన్నరప్.. ఈ స్టేజ్ కు చేరుకోవడానికి మాన్యాసింగ్ పడిన కష్టం.. కృషి తెలుసుకోవాల్సిందే..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2021 | 5:49 PM

Miss India Runner Up: అందాల పోటీలు పేరు చెబితేచాలు చాలా ధనవంతులు ఈ పోటీల్లో పాల్గొంటారు అని అందరూ భావిస్తారు.. అయితే తాజాగా ఫెమినీ మిస్​ ఇండియా పోటీ ఫలితాలు ఓ యువతి తండ్రి కృషి పట్టుదలకు ప్రతీకగా నిలిచాయి. అవును విఎల్​సిసి ఫెమినీ మిస్​ ఇండియా పోటీల్లో ఆటో రిక్షా వాలా కూతురు మన్యా సింగ్​ రన్నరప్​గా నిలిచింది. ఇదే పోటీలో తెలంగాణకు చెందిన మానస వారణాసి మిస్​ ఇండియాగానూ, హర్యానాకు చెందిన మనిక షూకండ్​ మిస్​ గ్రాండ్​ ఇండియానూ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే రన్నరప్​గా నిలిచిన మాన్య సింగ్​ జీవితం నేటి యువతకి ఆదర్శం..ఈరోజు రన్నరప్ గా నిలిచి అందరి మన్ననలను పొందుతున్న మాన్యా విజయగాథను తెలుసుకుందాం..!

అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎన్నో చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయమని చాలా మందికి ఈ రంగంలో రాణించాలని.. ప్రపంచానికి తమని తాము పరిచయం చేసుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్ధిక పరిస్థితులు అనుకూలించాక ఆలోచనను కార్యరూపంలో పెట్టారు.. అయితే ఉత్తర్ ప్రదేశ్ కు కుషినగర్​చెందిన మాన్యా సింగ్‌ తండ్రి అందరిలా ఆలోచించలేదు.మాన్యా సింగ్ తండ్రి ఆటో డ్రైవర్. తల్లి ఇంటి పనిచేస్తూ.. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకునేది.. పేదరికంతో మాన్యాసింగ్ చదువుకు మధ్యలోనే గుడ్ బై చెప్పి.. ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇక డిగ్రీ కోసం తల్లి వద్ద ఉన్న కొద్దీ బంగారం కూడా కుదవ పెట్టారు. తల్లిదండ్రులు కుటుంబం కోసం పడుతున్న కష్టాన్ని చూసిన మాన్యాసింగ్ పద్నాలుగు ఏళ్లప్పుడే ఇంట్లోనుంచి వెళ్లిపోయింది.

పొద్దున్నంతా చదువుకుని, సాయంత్రం ఓ హోటల్​లో గిన్నెలు తోమడానికి వెళ్ళేదానినని, ఆ తర్వాత ఓ కాల్​సెంటర్​లో ఉద్యోగం వచ్చిందని ఆమె వెల్లడించింది. దీంతో రాత్రిపూట కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేదాన్ని అని చెప్పింది. మిస్‌ఇండియా పోటీల్లో గెలవాలని నిర్ణయించుకొని దీనికోసం ఎ‍న్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు నడిచి వెళ్తు రిక్షా డబ్బులు కూడా దాచుకునే దాన్నని మాన్యా తన గతాన్ని.. ఆ సమయంలో పడిన కష్టాలను గుర్తు చేసుకుంది.

ఈరోజు తాను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే.. నా కోసం మా నాన్న, అమ్మ, తమ్ముడు పడిన కష్టం.. వారు అందించిన సహకారంవల్లనే అని సగర్వంగా లోకానికి చాటింది మాన్యాసింగ్. తను పడిన కష్టమే ఈరోజు నన్ను ఈ పోటీల వరకూ తీసుకొచ్చిందని తెలిపింది. ఓ రిక్షా వాలా ఫ్యామిలీ తమ ఇంటి ఆడపిల్ల అందాల కిరీటం గెలవాలని కలలు కున్నారు దానికోసం ఎంతో కష్టపడ్డారు. చివరికి ఒక అడుగు దూరంలో ఆ ఇంటి ఆడబడుచుకి ఆ అవకాశం చేజారిపోయింది. అయితే, వీఎల్‌సీసీ మిస్‌ ఇండియా పోటీలో రన్నరప్‌గా ఆ రిక్షావాలా తన కూతురుని ప్రపంచం ముందు నిలబెట్టడంలో మాత్రం ఆయన విజయం సాధించాడు. అంతేకాదు కృషి పట్టుదల ఉంటె ఆర్ధిక పరిస్థితి మనిషి ఎదుగుదల అడ్డంకి కాదని నిరూపించారు ఈ ఫ్యామిలీ.

Also Read:

: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అది ఒక్కటే ఉంటే చాలదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అందాల ‘నిధి’..

సర్కారు వారి’ సాంగ్స్‌పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్‌.. ‘అదిరిపోయే మ్యూజిక్ ఆన్ ది వే’ అంటూ పోస్ట్..