‘సర్కారు వారి’ సాంగ్స్‌పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్‌.. ‘అదిరిపోయే మ్యూజిక్ ఆన్ ది వే’ అంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata Movie: పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్,

'సర్కారు వారి' సాంగ్స్‌పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్‌.. ‘అదిరిపోయే మ్యూజిక్ ఆన్ ది వే’ అంటూ పోస్ట్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2021 | 4:43 PM

Sarkaru Vaari Paata Movie: పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్, ఆల్బమ్ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చాడు. డైరెక్టర్ పరశురాం, సినిమాటోగ్రాఫర్ మ్యాడీతో కలిసి ఉన్న పిక్ షేర్ చేసిన థమన్.. థర్డ్ కంపోజింగ్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయని తెలిపాడు. ఈ మేరకు ‘అదిరిపోయే మ్యూజిక్ ఆన్ ది వే’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన మహేశ్ అభిమానులు.. మూవీ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశార‌ని టాక్‌. ఇంతలోనే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ప‌ర‌శురాం అండ్ టీం ఈ సినిమా కోసం గోవాలో స్పెష‌ల్ సెట్ ఒక‌టి వేయ‌నుంద‌ట‌. దుబాయ్ షెడ్యూల్ అయిపోగానే గోవాకు ప‌య‌నం కానుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌. గోవాలో వేయ‌బోయే సెట్‌లో కొన్ని కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నట్టు వార్తలు వ‌స్తుండ‌గా దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇక ట్విట్టర్‌లో ‘సర్కారు వారి పాట’ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా మోత మోగిస్తున్నారు. #SarkaruVaariPaata అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ వరుస ట్వీట్స్ చేస్తుండటంతో ఈ సినిమా నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది. దీంతో ఏకంగా వంద మిలియన్లకు పైగా ఉపయోగించబడిన హ్యాష్ ట్యాగ్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

ఆచార్య కోసం ఆరాటపడుతున్న డైరెక్టర్ కొరటాల శివ .. చిరంజీవి కోసం కోట్లు ఖర్చుపెట్టి మరీ..