దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, గత కొద్ది రోజులుగా యాక్టీవ్ కేసుల సంఖ్య ఐదు లక్షల లోపే

దేశంలో కరోనావైరస్ తీవ్రత కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,548 కొత్త కేసులు నమోదయినట్లు

  • Ram Naramaneni
  • Publish Date - 10:48 am, Mon, 16 November 20
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, గత కొద్ది రోజులుగా యాక్టీవ్ కేసుల సంఖ్య ఐదు లక్షల లోపే

దేశంలో కరోనావైరస్ తీవ్రత కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,548 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 88,45,127కు చేరింది. కొత్తగా మరో 435 మంది వైరస్ కారణంగా చనిపోయారు.  దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,30,070కు చేరింది. జులై 13 తరవాత ఒక్క రోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే, ఆదివారం  పరీక్షల సంఖ్య (8,61,706) కూడా తగ్గడం పాజిటివ్ కేసులు తగ్గుదలకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.  తాజాగా 43,851 మంది కొవిడ్​ను జయించారు. దీంతో వ్యాధి బారి నుంచి మొత్తం  కోలుకున్నవారి సంఖ్య 82,49,579కు చేరింది.   ప్రస్తుతం దేశంలో 4,65,478 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా యాక్టీవ్ కేసుల సంఖ్య ఐదు లక్షల లోపే ఉంటుంది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల రేటు 5.26 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 93.27 శాతానికి పెరిగింది.  కరోనా నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12కోట్ల 56 లక్షల 98 వేల 525 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

Also Read :

గుడ్ న్యూస్..తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 502 మాత్రమే

సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​ రేసులో అజిత్ అగార్కర్ ​!

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట