గుడ్ న్యూస్..తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 502 మాత్రమే

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గింది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిస్తుంది. రాష్ట్రంలో ఆదివారం 17,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 502 మంది పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు.

గుడ్ న్యూస్..తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 502 మాత్రమే
Follow us

|

Updated on: Nov 16, 2020 | 9:03 AM

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గింది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిస్తుంది. రాష్ట్రంలో ఆదివారం 17,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 502 మంది పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. వైరస్ కారణంగా కొత్తగా ముగ్గురు మరణించారు. కాగా కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1,407 మంది మృతి చెందారు. కాగా కరోనా నుంచి కొత్తగా మరో 1,539 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,42,084గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,385 యాక్టివ్‌లు ఉన్నాయి. ఇల్లు లేదా సంస్థల ఐసోలేషన్‌లో 11,948 మంది ఉన్నారు. దక్షణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణలోనూ కొత్త పాజిటివ్ కేసులు భారీగా తగ్గడంతో అంతా హ్యాపీ ఫీలవుతున్నారు.

కానీ ఈ ఉపశమనం తాత్కాలికమే అని, రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించే ప్రమాదం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. చలి కాలం కారణంగా కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోందని, ప్రజలు మరింత అలెర్ట్‌గా ఉండాలని చెప్పారు. ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన.. టీఆర్ఎస్ నూతన కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిస్థితులపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, భౌతికదూరం, మాస్కు ధారణ, శానిటైజేషన్‌ను ఎట్టిపరిస్థితుల్లో మరవొద్దని కోరారు. నిజంగానే తెలంగాణలో కరోనా వేవ్ వచ్చే ప్రమాదముందా? అనేదానిపై వైద్య అధికారులు స్పందించాల్సి ఉంది.

Also Read :

తెరుచుకున్న శబరిమల ఆలయం, నేటి నుంచే భక్తులకు అనుమతి, మార్గదర్శకాలివే

పరమ పవిత్ర కార్తీక మాసం ప్రారంభం, నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట