New Scam: పిల్లలకు మోడలింగ్‌ ఫోటో షూట్స్‌ అంటూ యాడ్స్‌ వస్తున్నాయా.? క్లిక్‌ చేశారో..

మన అత్యాశనే సైబర్‌ నేరగాళ్లు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అందినాడికి దోచుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి నేరాలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు మోడలింగ్ షూట్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రకటనలు చూపించి పేరెంట్స్‌ను నిండా ముంచేస్తున్నారు..

New Scam: పిల్లలకు మోడలింగ్‌ ఫోటో షూట్స్‌ అంటూ యాడ్స్‌ వస్తున్నాయా.? క్లిక్‌ చేశారో..
Photoshoot Scam
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 14, 2024 | 7:23 AM

రోజురోజుకీ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకో కొత్త వ్యూహంతో మోసగాళ్లు అమాయకులు దోచేస్తూనే ఉన్నారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేయగానే రకరకాల యాడ్స్‌ కనిపిస్తున్నాయి. అలాంటి యాడ్స్‌లో.. మీ చిన్నారులకు ఫొటో షూట్‌ చేస్తామంటూ కనిపించే ప్రకటన ఒకటి.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, ఫస్ట్‌ క్రై వంటి ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌కి మీ చిన్నారుల ఫోటో షూట్స్‌ అవసరం ఉంటాయని. ఇందుకోసం మోడలింగ్‌ అవకాశాలు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అయితే ఇందులో చేరాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలని అంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు భారీగా జరుగుతున్నాయి.

తాజాగా ఢిల్లీలో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళకు ఫేస్‌బుక్‌లో.. లాట్స్ స్టార్ కిడ్స్ అనే సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఉన్న ఓ ప్రకటనను చూసింది. దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్‌ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్‌’కు తీసుకువెళ్లింది. ఆ తర్వాత ఫీజు చెల్లించింది.

అయితే రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన తర్వాత చిన్నారులకు మోడలింగ్ అసైన్‌మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్‌ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..