CRPF Women Commandos: కీలక నిర్ణయం.. నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు సీఆర్‌పీఎఫ్ మహిళా కమెండోలు..!
CRPF Women Commandos: నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ మహిళా కమెండోలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం ...
CRPF Women Commandos: నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ మహిళా కమెండోలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్పీఎఫ్ 88వ మహిళా బెటాలియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో విధి నిర్వహణకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్‌పీఎఫ్ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటు చేసిన ఘనత సీఆర్‌పీఎఫ్‌కే దక్కిందని, సీఆర్‌పీఎప్ మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి నక్సలైట్లను అరికట్టిస్తామని సీఆర్‌పీఎఫ్ స్పష్టం చేసింది.
కాగా, సీఆర్‌పీఎఫ్ మహిళా బెటాలియన్‌లోని 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో శిక్షణ ఇస్తున్నామని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏపి మహేశ్వరి అన్నారు. మహిళా బెటాలియన్‌లో పని చేస్తున్న పలువురు మహిళలకు అశోక్ చక్రతోపాటు పలు అవార్డులు దక్కాయన్నారు. విధి నిర్వహణలో భాగంగా సీఆర్‌పీఎఫ్ దళం అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తోందని ఆయన అన్నారు.