AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా అంతే.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు.. టాలీవుడ్ నటి ఎమోషనల్

ఇవాళ (జూన్ 10) గాడ్ ఆఫ్ మాసెస్, హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మార్మోగుతోంది. 'జై బాలయ్య' అంటూ కుప్పులు తెప్పలుగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య గొప్పతనం గురించి ఒక టాలీవుడ్ నటి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Balakrishna: బాలయ్యకు ఒక్క  మెసేజ్ చేశా అంతే..  ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు.. టాలీవుడ్ నటి ఎమోషనల్
Balakrishna Birthday Special
Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 8:47 AM

Share

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) ను పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఇక ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియా కూడా బాలకృష్ణ నామస్మరణతో మాగిపోతోంది. ఇదిలా ఉంటే బాలయ్య వ్యక్తిత్వం గురించ రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. బాలయ్యకు కోపం ఎక్కువని చిరాకు తెప్పిస్తే కొడతారని చాలా మంది అంటుంటారు. అయితే బాలయ్యను దగ్గర్నుంచి చూసిన వాళ్లు మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి అని ఇతరులకు కష్టం వస్తే అసలు తట్టుకోలేరని చెబుతుంటారు. ఈ మాటలను నిజం చేస్తూ కష్టాల్లో ఉన్న అభిమానులకు, సామాన్యులకు ఎన్నో రకాలుగా సాయం చేశారు బాలయ్య. అలా బాలయ్య సాయం అందుకున్న వారిలో సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ క్రమంలోనే సీనియర్ యాంకర్, నటి ఉదయ భాను ఓ ఇంటర్వ్యూలో బాలయ్య గొప్పతనం గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

‘ నేను 12 సంవత్సరాల వయసులో కెరీర్ ను మొదలు పెట్టాను. దీంతో అప్పటినుంచే నా జీవితంలో ఎలాంటి పండగలు, వేడుకలు, సెలబ్రేషన్స్ లేవు. కానీ ఆడపిల్లలన్నాక కొన్ని కోరికలు ఉంటాయి. అందులో గర్భం ధరించిన తర్వాత ఆ కోరికలు ఇంకా పెరుగుతాయంటారు. ముఖ్యంగా సీమంతం చేసుకోవాలని మహిళలందరూ కోరుకుంటారు. కానీ నా పరిస్థితి వేరు. ఒకానొక సమయంలో దేవుడు లేడు ఏమో అని అనుకున్నాను. కానీ దేవుడి దయతో నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయన ఆనందం నా ఇద్దరు కవల బిడ్డల రూపంలో తిరిగొచ్చింది. అలాంటి కవల పిల్లల తొలి పుట్టిన రోజును సినీ పరిశ్రమకు చెందిన వాళ్లతో సెలబ్రేట్ చేయాలనుకున్నాను. నా బిడ్డల బర్త్ డే సెలబ్రేషన్స్ కు రావాలని చాలామందికి ఫోన్ చేశాను. కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. చివరిగా బాలయ్యకు ఒక మెసేజ్ పెట్టాను. అరగంట తర్వాత బాలయ్య ఫోన్ చేశాను. నా పిల్లల పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చారు. బాలయ్యకు వేరే ప్రాంతంలో మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్ ను పూర్తి చేసి కరెక్టుగా చెప్పిన సమయానికి సింహాంలాగా వచ్చారు. ఆ సమయంలో బాలయ్య నాకు ఒక దేవుడులా కనిపించారు. అందరు సెలబ్రిటీల్లా ఐదారు నిమిషాలు ఉండిపోకుండా 45 నిమిషాల పాటు మా ఇంట్లోనే ఉండి అందరితో సరదాగా గడిపారు. అడిగిన వారందరికీ నవ్వుతూ ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చారు. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు’ అని చెప్పుకొచ్చింది ఉదయభాను.

బాలయ్య పుట్టిన రోజు నేపథ్యంలో ఉదయ భాను చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us