CoWin app: వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. నాలుగు అంకెల కోడ్ చెప్పాల్సిందే.. ‘కోవిన్’ యాప్‌లో సరికొత్త ఫీచర్
CoWin app security code: దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 16.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కోవిన్ పోర్టల్‌లో
CoWin app security code: దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 16.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. అయితే.. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కోవిన్ పోర్టల్ భద్రతపై ఎన్నో ఊహగానాలు మోదలయ్యాయి. ఈ పోర్టల్‌లో నమోదు చేసే సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్‌ను అమల్లోకి తీసుకు వచ్చింది. దీనివల్ల డేటా ఎంట్రీ ఎర్రర్స్ కూడా కనిష్ట స్థాయికి తగ్గుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కోవిన్ కొత్త ఫీచర్ మే 8 నుంచి అమల్లోకి వస్తుందంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌లో నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల డేటా ఎంట్రీ ఎర్రర్స్ కనిష్ట స్థాయికి తగ్గుతాయని.. భద్రత లోపం కూడా ఉండదని, ప్రజలకు కలిగే అసౌకర్యం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అంతకుముందు కొందరు చేసిన ఆరోపణల ప్రకారం.. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నిర్దేశిత తేదీ నాడు వ్యాక్సినేషన్ కోసం వెళ్లకపోయినా.. వారికి వ్యాక్సినేషన్ జరిగినట్లు ఎస్ఎంఎస్ వచ్చేది. దీంతోపాటు భద్రతాపరమైన వివరాలకు కూడా విఘాతం కలుగదని ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇకపై వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హతగల వ్యక్తికి వ్యాక్సిన్ డోసును ఇవ్వడానికి ముందు వెరిఫయర్/వ్యాక్సినేటర్ ఆ వ్యక్తిని నాలుగు అంకెల కోడ్ చెప్పాలని సూచించింది. ఆ కోడ్‌ను కోవిన్ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తారని తెలిపింది. దీంతో వ్యాక్సినేషన్ స్టేటస్ సరైన విధంగా రికార్డ్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ నాలుగు అంకెల కోడ్ వస్తుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ మీద కూడా ఈ కోడ్ ఉంటుంది. లబ్ధిదారునికి అపాయింట్‌మెంట్ ఖరారు అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్‌లో కూడా ఈ నాలుగు అంకెల కోడ్ ఉంటుంది. వారు దీనిని చెప్పి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: