PM Modi: ప్రధాని మోడీ నివాసంలో దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఏం పేరు పెట్టారో తెలుసా?
ప్రధాన నరేంద్ర మోడీ ఇంట్లో ఓ అవు దూడకు జన్మనిచ్చింది. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఈ దూడ జన్మించింది. దీంతో ప్రధాని మోడీ ఆ దూడకు ప్రత్యేక పూజలు చేసి శాలువ కప్పారు. దూడను దేవి విగ్రహం వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే దూడ నుదుడిపైన..
ప్రధాన నరేంద్ర మోడీ నివాసం ఆవరణలో ఓ అవు దూడకు జన్మనిచ్చింది. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఈ దూడ జన్మించింది. దీంతో ఈ దూడ ప్రధాని ఇంట్లో ఓ కొత్త సభ్యుడుగా చేరింది. దూడ దాని నుదిటిపై ఒక ప్రత్యేకమైన గుర్తును ఉంది. ఇది కాంతికి చిహ్నంగా ఉంది. ఈ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దూడకు ‘ దీపోజ్యోతి ‘ అని పేరు పెట్టారు.
అంతేకాదు.. మోడీ ఆ దూడకు ప్రత్యేక పూజలు చేసి శాలువ కప్పారు. దూడను దేవి విగ్రహం వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ ఆ దూడను ఓల్లో కూర్చోబెట్టుకుని కాసేపు తలను నిమురుతూ ఉండిపోయారు. “గావ్: సర్వసుఖ ప్రద:” అనే గ్రంధాలను ఉటంకిస్తూ, పవిత్రమైన కార్యక్రమంపై ప్రధాన మంత్రి తన ఆలోచనలను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న ఆవు దూడకు జన్మనివ్వడంతో శుభప్రదంగా భావించారు.
हमारे शास्त्रों में कहा गया है – गाव: सर्वसुख प्रदा:’।
लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है।
प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है।
इसलिए, मैंने इसका नाम ‘दीपज्योति’… pic.twitter.com/NhAJ4DDq8K
— Narendra Modi (@narendramodi) September 14, 2024
పోస్ట్ చేసిన వీడియోలో ప్రధాని మోడీ నవజాత దూడను ప్రార్థనలు, ఆప్యాయతతో స్వాగతిస్తున్నట్లు చూడవచ్చు. వీడియోలో ప్రధాని ఈ దూడకు ముద్దులు పెట్టడం, ఆడుకోవడం, దాని నుదిటిపై సున్నితమైన ముద్దులు కూడా పెట్టడం వంటివి చూడవచ్చు. పిఎం మోడీ దూడను పట్టుకుని తన నివాసంలోని గార్డెన్‌లో షికారు చేయడంతో వీడియో ముగుస్తుంది.
A new member at 7, Lok Kalyan Marg!
Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4
— Narendra Modi (@narendramodi) September 14, 2024
కాగా, ప్రపంచంలోని పురాతన మతాలలో ఒకటైన సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధిస్తూ పూజిస్తుంది. ప్రకృతిని మాత్రమే కాదు జంతువులు, మొక్కలను పూజించే ఆచారం శతాబ్దాలుగా హిందూమతంలో ఉంది. హిందూమతంలో ఆవుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆవును గోమాతగా పిలుస్తుంటారు. సనాతన ధర్మంలో యుగయుగాలుగా ఆవు.. దేవతగా పూజలందుకుంటోంది. ఆవు పాలు, తల్లి పాలతో సమానంగా భావిస్తుంటారు. అమ్మపాలలో ఉన్న ప్రొటీన్ల కంటే ఎక్కువ ఆవు పాలలో ఉంటాయి. అందుకే అమ్మతో సమానంగా ఆవును భావిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి