AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro Network: తగ్గేదే లే.. ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!

Metro Network: భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఇతర దేశాల సరసన స్థానం దక్కించుకుంటోంది. అన్నింటిలోనూ భారత్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. ఇలాగే మెట్రో రైల్‌ విషయంలో కూడా భారత్‌కు ప్రత్యేక స్థానం దక్కింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ను భారత్‌ సొంతం చేసుకుంది..

Metro Network: తగ్గేదే లే.. ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!
Subhash Goud
|

Updated on: Jan 15, 2025 | 6:34 PM

Share

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. 1,000 కి.మీ మెగా మెట్రో రైలు నెట్‌వర్క్ మైలురాయిని ఇటీవలే చేరుకుంది. పది రోజుల క్రితం ఢిల్లీ మెట్రో నాల్గవ దశ ప్రాజెక్టులో భాగంగా 2.8 కిలోమీటర్ల పొడవైన జంకాపురి, కృష్ణా పార్క్ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ నమో భారత్ కారిడార్ 13 కి.మీ విస్తరణను కూడా మోడీ ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్ 1,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్‌ నిలిచింది. భారతదేశం కంటే చైనా, అమెరికాలలో ఎక్కువ మెట్రో రైలు నెట్‌వర్క్ ఉంది.

భారతదేశంలో మొదటి మెట్రో రైలు నెట్‌వర్క్ 1984లో కోల్‌కతాలో స్థాపించారు. అయితే, ఆధునిక మెట్రో వ్యవస్థ మొదట ఢిల్లీలో నడిచింది. జపాన్ టెక్నాలజీ సాయంతో ఢిల్లీలో మెట్రో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే 16వ అతిపెద్ద మెట్రో వ్యవస్థ.

బెంగళూరుతో సహా దేశంలోని 23 నగరాల్లో ఇప్పుడు మెట్రో రైలు వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. 11 రాష్ట్రాలు మెట్రో సేవలను కలిగి ఉన్నాయి. 2014లో భారతదేశంలోని వివిధ మెట్రో రైళ్లలో రోజుకు 28 లక్షల మంది ప్రయాణించేవారు. నేడు రోజుకు కోటి మంది ప్రయాణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక మెట్రో రైలు ప్రాజెక్టులు, పనులను ప్రారంభించారు. ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ నమో భారత్ కారిడార్‌ను రూ.4,600 కోట్లతో 13 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. ఢిల్లీ, మీరట్ మధ్య మంచి వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. రూ.1200 కోట్లతో జనక్‌పురి-కృష్ణా పార్క్ మధ్య మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. మోడీ ఈ మార్గాన్ని కూడా ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో నాల్గవ దశలో భాగమైన రిటాలా, కుండ్లీ సెక్షన్‌లోని 26.5 కి.మీ విభాగానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఢిల్లీ మెట్రో తర్వాత భారతదేశంలో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ బెంగళూరులో ఉంది. సిలికాన్ సిటీలో ఇప్పటివరకు నిర్మించిన మెట్రో రైలు మార్గాల పొడవు 76 కి.మీ కంటే ఎక్కువ. ఢిల్లీ మెట్రో దాదాపు 350 కి.మీ మేర భారీ మెట్రో నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అత్యధిక మెట్రో రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న హైదరాబాద్ బెంగళూరుకు దగ్గరగా ఉంది. ఇక్కడ 71 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఉంది. కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో మెట్రో నెట్‌వర్క్ 50 కి.మీ కంటే ఎక్కువ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి