పచ్చపచ్చని పెసర పప్పులో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

15 January 2025

TV9 Telugu

TV9 Telugu

శనగలు, కందులైతే అరుగుదల కొంచెం కష్టం కానీ పచ్చపచ్చని పెసలు విషయంలో అలాకాదు. తేలిగ్గా జీర్ణమవుతాయి. మన తెలుగువాళ్లకి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు ముందుంటుంది

TV9 Telugu

రుబ్బి, అట్టేయడం సంగతలా ఉంచితే.. నానబెట్టి మొలకలొచ్చాక తిన్నా రుచిగానే ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి పెసలెంతో శ్రేష్ఠం అంటారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

పెసలలో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఎ, సి విటమిన్లు, ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, సోడియం, ఐరన్, క్యాల్షియం.. వంటి మరెన్నో పోషకాలుంటాయి. పెసలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి

TV9 Telugu

పెసర పప్పులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయి క్రమబద్ధంగా ఉండేందుకు తోడ్పడతాయి. గుండె జబ్బులను రానివ్వవు. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి

TV9 Telugu

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఊపిరితిత్తులకు హానిచేసే వైరస్‌లను, యాంటీ వైరల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. కురులను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయాన్ని సంరక్షిస్తాయి. వీటితో జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. ఊబకాయం రాదు

TV9 Telugu

అయితే పెసర పప్పుతో పెరుగు కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు దండిగా లభిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగును పెసర పప్పుతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చట

TV9 Telugu

పెసర పప్పు, పెరుగు రెండింటిలో ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా, పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ కూడా ఉంటాయి. పప్పు, పెరుగు కలిపి తింటే ఎముకలు, కండరాలు బలపడతాయి

TV9 Telugu

పెసర పప్పు, పెరుగు రెండూ కలిపి తింటే శరీరంలో ప్రొటీన్ లోపం తగ్గుతుంది. ఇందులో విటమిన్ B9తోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది