చాలా మంది భోజనం చేసిన తర్వాత గుండె మంట లేదా, అల్సర్ వంటి సమ్యలను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అలాంటి వారు వీటిని ఆహారం చేర్చుకోవడం వలన దాని నుంచి ఉపశమనం పొందవచ్చునంట.
మహిళలు వీటిని తీసుకోవడం వలన రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అంతే కాకుండా దీనిని తీసుకోవలన మలబద్ధకం సమస్యను ఆరికడుతుంది.
సామలు కీళ్ల నొప్పులకు, ఊబకాయం సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది. అలానే గుండె సమస్యలకు కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.
అంతే కాకుండా సామలులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మైగ్రేన్ సమస్యలు ఉన్న వాళ్లు కూడా సామలు తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మైగ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
సామలులో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
సామలులో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడమే కాకుండా, ఇందులో ఉండే కేలరీల వలన బరువు తగ్గుతారు.
సామలులో గ్లైసెమిక్ ఇండెక్స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను నెమ్మదిగా పెంచుతుంది.అలాగే మెటబాలిజం రేటును పెంచుతుంది. దీంతో కేలరీలను బర్న్ చేస్తాయి.