AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది? తాజా అధ్యయనం పూర్తి వివరాలు

Covid-19 Third Wave: కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగిస్తోంది. అయితే లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్ రావచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Covid-19 Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది? తాజా అధ్యయనం పూర్తి వివరాలు
Representative Image
Janardhan Veluru
|

Updated on: Jun 22, 2021 | 11:30 AM

Share

Covid-19 Third Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖంపడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గం.ల వ్యవధిలో దేశంలో 42,640 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గత 91 రోజుల్లో నమోదైన అతి తక్కువ కేసులు కావడం విశేషం. 1,167 మంది కరోనా బారినపడి మరణించగా…81,839 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు తగ్గుతుండటం ఊరట కలిగిస్తున్నా..పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయడం, ఆంక్షలు సడలించడంతో థర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్నాయి. ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్ రావచ్చని ఇప్పటికే కొన్ని సర్వేల నివేదికలు హెచ్చరించాయి. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి.

తాజాగా ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఐఐటీ కాన్పూర్ అధ్యయనం మేరకు దేశంలో థర్డ్ వేవ్ ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో ఉధృతంగా ఉండే అవకాశముంది. ప్రొఫసర్ రాజేష్ రంజన్, మహేంద్ర వర్మ నేతృత్వంలోని బృందం ఈ సర్వే నిర్వహించింది. సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుందన్న దానిపై అంచనావేశారు. జులై 15నాటికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసే అవకాశముందని అంచనావేస్తున్నట్లు తెలిపింది.

కొన్ని ఈశాన్య రాష్ట్రాలు(మిజోరాం, మణిపూర్, సిక్కిం) మినహా దేశంలో సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి ఎగువున ఉంది. చాలా రాష్ట్రాల్లో ఇది 5 శాతం కంటే తక్కువగానే ఉంది.

వ్యాక్సినేషన్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఐఐటీ కాన్పూర్‌ బృందం కరోనా థర్డ్ వేవ్‌కు సంబంధించి నిర్వహించిన మరో సర్వే నివేదిక ఈ వారాంతంలో వెలువడనుంది.

Also Read..

గుడ్ న్యూస్.. దేశంలో తగ్గుతోన్న కరోనా తీవ్రత.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య..

డెల్టా వేరియంట్‌తో యమా డేంజర్.. అప్రమత్తంగా వుండాలంటున్న శాస్త్రవేత్తలు