Fact Check: వ్యాక్సిన్‌పై వస్తున్న ఆ వార్తలను అస్సలు నమ్మోద్దు.. కేంద్రం కీలక ప్రకటన..

Covishield Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెలాఖరుకు (ఫిబ్రవరి చివరి నాటికి) 50 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోసులు

Fact Check: వ్యాక్సిన్‌పై వస్తున్న ఆ వార్తలను అస్సలు నమ్మోద్దు.. కేంద్రం కీలక ప్రకటన..
Covishield Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2022 | 9:20 AM

Covishield Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెలాఖరుకు (ఫిబ్రవరి చివరి నాటికి) 50 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోసులు వృథాగా పోయే అవకాశం ఉందంటూ పలు వార్తలు వచ్చాయి. దీంతోపాటు కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో 50 లక్షల కోవిషీల్డ్‌ (Covishield) వ్యాక్సిన్ డోసులు వృథాగా పోయే అవకాశం ఉందంటూ వచ్చిన పలు అస్పష్టమైన వార్తలపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Health Ministry) స్పందించింది. ఈ వార్తలు నిరాధారమైనవని.. తప్పుదోవ పట్టించేవని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం హెచ్చరించింది. టీకాల లభ్యతపై వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆరంభం నుంచి రాష్ట్రాలతో సమీక్ష జరుపుతూనే ఉన్నామని తెలిపింది. ఎక్కడా కూడా టీకా వృథాగా పోయే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం ప్రకటనను విడుదల చేసింది. వ్యాక్సిన్లు నిరుపయోగంగా ఉన్న చోట నుంచి మరోచోటికి బదిలీ చేసే అవకాశం కూడా రాష్ట్రాలకు కల్పించామని స్పష్టం చేసింది. ఆయా సంస్థల వద్ద ఉన్న టీకాలను ఎక్స్‌పైరీ తేదీకి ముందే వినియోగించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశించామని పేర్కొంది. టీకాలు వృధాగా పోయే అవకాశమే లదేని.. ఇలాంటి వార్తలను నమ్మోద్దంటూ సూచించింది. ఈ మేరకు కేంద్రం (Central Govt) ప్రకటనను విడుదల చేసింది.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 167.88 కోట్ల డోస్‌లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 96% మంది మొదటి డోస్ పొందినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. 76% మందికి రెండవ డోస్ ఇచ్చామని.. 1.35 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లు వెల్లడించారు.

Also Read:

Cryptocurrency: క్రిప్టోలో ఎంత సంపాదించారో ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిందే.. కొత్త నిబంధనల గురించి..

Building Collapse: నిర్మాణంలో ఉన్న మాల్ భవనం కూలి.. ఐదుగురు దుర్మరణం.. పనులు చేస్తుండగా..