Indian Companies: సెమీకండక్టర్లు, సెన్సార్లు తయారు చేసే కంపెనీలకు కేంద్రం గుడ్‌న్యూస్
Indian Companies: ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీకి భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది...
Indian Companies: ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీకి భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సెమీకండక్టర్లు (Semiconductor),సెన్సార్ల (Sensors) రంగంలో భారత్ మరింత అభివృద్ధి చెందేందుకు ఇప్పుడు రుణాలు , ఈక్విటీ, వాణిజ్యీకరణ (Commercialization) కోసం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం (Financial Assistance) పొందేందుకు గొప్ప అవకాశం ఉంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC), చిప్‌సెట్, చిప్స్ ఆన్ సిస్టమ్ (SOSC) మొదలైన వాటి కోసం భారతీయుల నుండి ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్ రంగాలపై దృష్టి సారిస్తున్నాయి కంపెనీలు.
ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు:
ఈ రంగాలపై కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకునేందుకు భారతీయ కంపెనీలకు రుణాలు, ఈక్విటీ, గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం, సైన్స్ డిపార్ట్‌మెంట్ చట్టబద్ధమైన సంస్థ అయిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు ఆహ్వానించిన ప్రతిపాదనలలో ఆర్థిక సహాయం అందించనుంది భారత ప్రభుత్వం. ఈ రుణాలపై దరఖాస్తు చేసుకునేందుకు కంపెనీలకు పిలుపునిస్తోంది. అయితే మంచి గుర్తింపు ఉండి, ధృవీకరణ పత్రాలున్న కంపెనీలకు అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీకి గ్లోబల్ హబ్‌గా భారతదేశాన్ని నెలకొల్పడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికత. చిప్‌సెట్‌లతో సహా కీలకమైన భాగాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమ రంగంలో పోటీ పడేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.
సెమీకండక్టర్ తయారీకి స్థిరమైన పెట్టుబడి అవసరం:
పరిశ్రమ 4.0 ప్రకారం.. డిజిటల్ పరివర్తన తదుపరి దశను నడిపించే ఆధునిక ఎలక్ట్రానిక్స్‌కు సెమీకండక్టర్లు, డిస్‌ప్లేలు ఆధారం. సెమీకండక్టర్స్, డిస్‌ప్లే తయారీ అనేది చాలా టెక్నాలజీ-ఇంటెన్సివ్ సెక్టార్‌లు. స్థిరమైన పెట్టుబడులు అవసరం. సాంకేతిక మద్దతును సులభతరం చేయడం ద్వారా సెమీకండక్టర్, సెన్సార్ల తయారీని పెంచుతుంది.
ఇవి కూడా చదవండి: