Delta Variant: చికెన్‌పాక్స్ కంటే డెల్టా వేరియంట్ యమా డేంజర్.. హెచ్చరిస్తోన్న పరిశోధకులు..

Covid 19 Delta Variant: దేశంలో నెమ్మదిగా డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా...

Delta Variant: చికెన్‌పాక్స్ కంటే డెల్టా వేరియంట్ యమా డేంజర్.. హెచ్చరిస్తోన్న పరిశోధకులు..
Delta Variant
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 31, 2021 | 5:17 PM

దేశంలో నెమ్మదిగా డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 డెల్టా కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో-23, మధ్యప్రదేశ్‌లో-11, తమిళనాడులో 10కి పైగా, తెలంగాణలోనూ రెండు వేరియంట్లు వెలుగుచూసినట్లు కేంద్రం తెలిపింది. డెల్టా వేరియంట్ ప్లస్ వైరస్‌‌లో వెయ్యి రెట్లు ఎక్కువగా వైరల్ లోడ్ ఉంటుందని కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని ప్రజలు కూడా డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు తెలిపారు.

ఇకపోతే, చికెన్‌పాక్స్‌ ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్‌ కూడా అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్‌ సీడీసీ హెచ్చరించింది. మెర్స్, సార్స్, ఎబోలా, జలుబు, స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్‌ వైరస్‌ల కన్నా డెల్టా వేరియంట్‌ వేగంగా సోకుతుందని తెలిపింది. అమెరికాలో టీకా తీసుకున్న వారిలో సైతం డెల్టా సోకినట్లు సీడీసీ తెలిపింది..ఈ లెక్కన ప్రతి చోటా ప్రతి ఒక్కరూ తప్పక మాస్కులు ధరించడం మంచిదని సూచించారు. ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

టీకా తీసుకున్నవారు సైతం డెల్టా వ్యాప్తికి కారకులు కావడం ఆందోళనకరమైన విషయమని చెప్పారు. అయితే డెల్టా సోకినా సరే టీకా తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లేనన్నారు. టీకా వల్ల వ్యాధి తీవ్రత 90 శాతం వరకు తగ్గుతుందని, అందువల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలయ్యేందుకు, లేదా తీవ్ర వ్యాప్తికి కారణమయ్యేందుకు ఛాన్సులు తక్కువన్నారు.