మిజోరంతో కయ్యం…నాగాలాండ్ తో ‘నెయ్యం’ ! అస్సాం ప్రభుత్వ వ్యూహం.. బోర్డర్స్ లో శాంతికి అంగీకారం

ఓ వైపు మిజోరంతో సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్న అస్సాం..పక్కనున్న నాగాలాండ్ తో శాంతి మంత్రం జపించింది. నాగాలాండ్ తో తమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత శర్మ ప్రకటిస్తూ..

మిజోరంతో కయ్యం...నాగాలాండ్ తో 'నెయ్యం' ! అస్సాం ప్రభుత్వ వ్యూహం.. బోర్డర్స్ లో శాంతికి అంగీకారం
Assam Cm Himanta Sarma Announces Resolution Of Border Dispute With Nagaland
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 31, 2021 | 5:53 PM

ఓ వైపు మిజోరంతో సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్న అస్సాం..పక్కనున్న నాగాలాండ్ తో శాంతి మంత్రం జపించింది. నాగాలాండ్ తో తమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత శర్మ ప్రకటిస్తూ.. బోర్డర్ లొకేషన్స్ లో తమతమ బలగాలను ఉపసంహరించాలని తాము అంగీకారానికి వచ్చినట్టు తెలిపారు. అస్సాం-నాగాలాండ్ సరిహద్దుల్లో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు అంగీకారానికి వచ్చారని ఆయన ట్వీట్ చేశారు. ఇది అతి ప్రధానమైన ముందడుగని పేర్కొన్నారు. దీంతో ఉభయ రాష్ట్రాల భద్రతా దళాలు వారివారి బేస్ క్యాంపులకు తరలుతాయన్నారు. ఈ అంగీకారం చరిత్రాత్మక చర్య అని అభివర్ణించారు. ఈ బోర్డర్స్ లోని దేస్సాయ్ వ్యాలీ రిజర్వ్డ్ ఫారెస్ట్, సురాంగ్ కాంగ్ వ్యాలీ మధ్య ఈ రెండు రాష్ట్రాల సెక్యూరిటీ దళాలు మోహరించి ఉన్నాయి. అయితే ఇవి ఇక తమ బేస్ క్యాంపులకు తరలి వెళ్లనున్నాయి. శనివారం అస్సాం-నాగాలాండ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు సమావేశమై ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

వివాదాస్పద ఏరియాల్లో శాంతి నెలకొనేలా చూడాలని తమ సమావేశంలో నిర్ణయించినట్టు వీరు ఆ తరువాత ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. రానున్న 24 గంటల్లో ఈ సరిహద్దుల్లో ఏకకాలంలో సెక్యూరిటీ దళాల ఉపసంహరణ జరగాలని ఈ మీటింగ్ లో తీర్మానించినట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంగీకారం కుదరడం పట్ల నాగాలాండ్ సీఎం నీఫ్యు రియోకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ అన్నారు. ఈశాన్య ప్రాంత సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి ఈ ఒడంబడిక దోహదం చేస్తుందన్నారు. అయితే పక్కనే ఉన్న మిజోరాం సమస్య మాత్రం ఈయన ప్రభుత్వానికి కంట్లో నలుసులాగే ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి : భారీ వర్షాలు ఆ గ్రామానికి శాపాలుగా మారాయి.. ఎడ్లబండి లోనే ప్రసవించిన మహిళ..:woman gave birth in cart Video.

 ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్‌..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.

 ప్రిన్సిపల్‌ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం..వానర బీభత్సం..:Monkey In School Video.

సముద్రం అడుగున చిక్కిన ఏలియన్స్ ..!రష్యా చేపల వేటలో వింత చేప..ఏలియన్ రూపంలో..:Alien In Sea video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu