AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin: ”సెప్టెంబర్‌లో పిల్లలకు కోవాగ్జిన్ టీకా.. పిల్లలపై థర్డ్ వేవ్ ముప్పు తక్కువే”: ఎయిమ్స్ చీఫ్

Covaxin For Children: దేశంలో రెండేళ్లు పైబడిన చిన్నారులకు సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా..

Covaxin: ''సెప్టెంబర్‌లో పిల్లలకు కోవాగ్జిన్ టీకా.. పిల్లలపై థర్డ్ వేవ్ ముప్పు తక్కువే'': ఎయిమ్స్ చీఫ్
Randeep Guleria
Ravi Kiran
|

Updated on: Jun 23, 2021 | 8:08 AM

Share

దేశంలో రెండేళ్లు పైబడిన చిన్నారులకు సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. పిల్లలపై కోవాగ్జిన్ చేపట్టిన రెండు, మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ డేటా సెప్టెంబర్‌లో అందుబాటులోకి వస్తుందని.. అదే నెలలో వ్యాక్సిన్‌కి అనుమతి లభించవచ్చునని అన్నారు. పైజర్, బయోNటెక్‌ టీకాలకు సైతం భారతదేశంలో గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. వాటిని కూడా పిల్లలకు అందించే అవకాశం ఉందని రణదీప్ గులేరియా స్పష్టం చేశారు.

గత నెల 12వ తేదీన చిన్నారులపై భారత బయోటెక్ చేపట్టిన రెండు, మూడు దశల క్లినికల్ ట్రయిల్స్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితి అంచనా వేసిన తర్వాతే స్కూల్స్ పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిమ్స్ చీఫ్ అన్నారు. అలాగే కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉండే చిన్నారులను ప్రత్యామ్నాయ రోజుల్లో స్కూల్స్‌కి రప్పిస్తే.. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుందని అన్నారు.

సెరో సర్వేలో ఏం చెబుతోంది…

పిల్లల్లో యాంటీబాడీల ఉత్పత్తిను సెరో సర్వేలు సూచించాయని రణదీప్ గులేరియా అన్నారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి రీజన్ లేదని ఆయన అన్నారు. ”క్లినికల్ ట్రయిల్స్ కోసం వచ్చినప్పుడు.. పిల్లల్లో యాంటీబాడీల ఉత్పత్తిని చూశాం” అని ఆయన అన్నారు. ఎయిమ్స్, డబ్ల్యూహెచ్ఓ కలిసి చేసిన అధ్యయనంలో పిల్లల్లో అధిక సెరో-పాజిటివిటీ బయటపడింది. కోవిడ్ థర్డ్ వేవ్ ఇతరాల కంటే పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపదని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!