Jyoti Malhotra: పాకిస్తాన్ ‘మేడమ్ N’.. జ్యోతి మల్హోత్ర కేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు
జ్యోతి మల్హోత్ర. అందమే పెట్టుబడిగా యువతను తన ఫాలోవర్లుగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి డబ్బు మాయలో పడి.. పొరుగుదేశం పాకిస్తాన్‌కు వెళ్లి భారత్‌లో గూఢచర్యం చేసేందుకు బేరం కుదుర్చుకుంది. పహల్గాం అటాక్ తర్వాత ఈ హర్యానా వాసి విషయం వెలుగులోకి..

జ్యోతి మల్హోత్ర. అందమే పెట్టుబడిగా యువతను తన ఫాలోవర్లుగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి డబ్బు మాయలో పడి.. పొరుగుదేశం పాకిస్తాన్‌కు వెళ్లి భారత్‌లో గూఢచర్యం చేసేందుకు బేరం కుదుర్చుకుంది. పహల్గాం అటాక్ తర్వాత ఈ హర్యానా వాసి విషయం వెలుగులోకి రావడంతో దేశమే షాక్ అయింది. టూరిస్ట్‌గా వెళ్లి స్పైగా వచ్చిన జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో ట్విస్టు బయటకు వస్తోంది. ఆమె ఎవరెవరితో పరిచయాలు పెంచుకుంది.. ఆమెను ఎవరు ఈ ఊబిలోకి లాగారనేది కూడా తెలిసింది. అయితే భారత్‌కు చెందిన 500 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్ వేసిన వలలో చిక్కుకున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్. మరి ఈ మొత్తం స్పై నెట్‌వర్క్‌ను వెనకుండా నడిపించింది ఎవరు? వారికి సహకరించిందెవరు? గూఢచర్య నెట్‌వర్క్‌లో చిక్కుకున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి రోజుకో కొత్త రహస్యం బయటపడుతోంది. ఈ పాడ్‌కాస్ట్ వీడియో మరోసారి జ్యోతి రహస్యాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్‌లో ఆమె ఎవరితో పరిచయాలు పెంచుకుందో.. వారంతా ఐఎస్‌ఐతో సంబంధాలు కలిగిఉన్నారని తేల్చేస్తోంది. పాకిస్తానీ యూట్యూబర్ నాసిర్ ధిల్లాన్‌తో ఆమెకు పరిచయం కూడా ఉంది. ధిల్లాన్‌తో పాడ్‌కాస్ట్ నిర్వహించి.. వారి దేశంలో అనుభవాలను షేర్ చేసుకుంది జ్యోతి మల్హోత్ర. జ్యోతితో వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాసిర్ ధిల్లాన్. అతను పాక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత తన సొంత యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఇంతలో, నాసిర్ ధిల్లాన్‌తో ఖలిస్తానీలకు ఉన్న సంబంధం...