Coronavirus: కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాదా.. వైరస్‌తో కలిసి జీవించాల్సిదేనా.. నిపుణులు ఏమంటున్నారంటే..?

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ప్రతిరోజు లక్షలాది మంది వ్యాధి బారిన పడుతున్నారు. కోవిడ్-19 2019లో వెలుగుచూసింది.

Coronavirus: కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాదా.. వైరస్‌తో కలిసి జీవించాల్సిదేనా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Follow us

|

Updated on: Jan 27, 2022 | 12:08 PM

Coronavirus: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ప్రతిరోజు లక్షలాది మంది వ్యాధి బారిన పడుతున్నారు. కోవిడ్-19 2019లో వెలుగుచూసింది. అప్పటి నుంచి అనేక రకాలుగా దాడి చేస్తూనే ఉంది. కరోనా వైరస్ వందల కొద్దీ మార్పులతో ప్రజలపై దాడి చేస్తోంది. బిలియన్ల మంది ప్రజలు ఈ వైరస్‌ల బారిన పడ్డారు. 5 మిలియన్లకుపైగా ప్రజలు మరణించారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన కరోనా ఇన్ఫెక్షన్ ముప్పు ఇంకా ముగిసిపోలేదు. ఈ వైరస్ ఇప్పట్లో మానవాళిని వదిలేలా కనిపించడం లేదు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దానితో జీవించడం నేర్చుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. యూరప్ జనవరి 2020 నుంచి విధించిన అన్ని పరిమితులను సడలించడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు మారిన వాతావరణానికి అలవాటు పడతారని భావిస్తున్నారు. కోవిడ్ ఇప్పుడు స్థానిక వైరస్‌గా మారింది. ఇది ఎప్పటికీ పోని ఇతర వైరస్ లేదా ఫ్లూ లాగా మారింది.

మారుతున్న పరిస్థితులపై పలువురు నిపుణులు మాట్లాడుతూ, కాలక్రమేణా కరోనావైరస్ ఏ ఆకారం, రూపం తీసుకుంటుందనే దానిపై చాలా అనిశ్చితి ఉందని, ఇది ఎక్కువ మంది వ్యక్తులను ప్రభావితం చేస్తుందా లేదా దాని కొత్త రూపాంతరం మరింత ప్రాణాంతకంగా మారుతుందా అనేది పూర్తిగా తేలియదని అంటున్నారు. ముందు ముందు మరెన్నీ మార్పులు వస్తాయి, ఇంకా ఎన్ని ఉత్పరివర్తనలు చూస్తాం, ఈ వైరస్‌కు వ్యతిరేకంగా మనం రోగనిరోధక శక్తిని పొందుతామా లేదా అనేది పూర్తిగా తెలియదు. డాక్టర్లు ఈ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణలోనే ఉన్నారు. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు అవసరమైన అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తేనే దీనిని నుంచి త్వరగా బయటపడగలం అని నిపుణులు అంటున్నారు.

కాగా, జీవనోపాధి కోసం ప్రజలు బయటకు రావడంతో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. కానీ, పరిస్థితుల్లో మార్పుల రావాలంటే కచ్చితంగా సమయం పడుతుంది. కానీ, అన్ని జాగ్రత్తలు తీసుకుని బనులు చేసుకోవడం చాలా మంచిదని అంటున్నారు. అలాగే విద్యా సంస్థల్లోనూ ప్రత్యేక భద్రతలు తీసుకుని తరగతులకు హాజరు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థిలు ఏర్పడ్డాయి. ఈ వైరస్ ఎప్పుడు అంతమువుతుదో తెలియదు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకుసాగాలని వారు అంటున్నారు.

నిరాకరణ: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.

Also Read: Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్ బారిన పడ్డారంటే..

Coronavirus: కరోనా పేషెంట్‌కు పురుడు పోసిన డాక్టర్లు.. ప్రభుత్వ వైద్యులపై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రులు హరీష్, కేటిఆర్