Uttarakhand Elections: కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్.. బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్‌ కిషోర్‌ ఉపాధ్యాయ్‌

Kishore Upadhyay: ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్ తగలింది. ఆ రాష్ట్ర మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ కిషోర్‌ ఉపాధ్యాయ్‌ గురువారం బీజేపీలో చేరారు.

Uttarakhand Elections: కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్.. బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్‌ కిషోర్‌ ఉపాధ్యాయ్‌
Ishore Upadhyay
Follow us

|

Updated on: Jan 27, 2022 | 11:04 AM

Uttarakhand Assembly Election 2022: ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీ(Congress)కి మరో షాక్ తగలింది. ఆ రాష్ట్ర మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ కిషోర్‌ ఉపాధ్యాయ్‌(Kishore Upadhyay) గురువారం బీజేపీ(BJP)లో చేరారు. బీజేపీలో చేరిన అనంతరం కిషోర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ ‘ఉత్తరాఖండ్‌ను ముందుకు తీసుకెళ్లాలనే స్ఫూర్తితో బీజేపీలో చేరాను’ అని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ను వీడాలనే ప్రశ్నకు ‘అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కాంగ్రెస్‌ని మీరే అడగాలి’ అని అన్నారు.

మరోవైపు, కిషోర్ ఉపాధ్యాయ్‌ను కాంగ్రెస్ పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరించిన సంగతి తెలిసింది. గతంలో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై కిషోర్ ఉపాధ్యాయ్‌ను అన్ని పదవుల నుండి కాంగ్రెస్ తొలగించింది. కిషోర్ ఉపాధ్యాయ్‌ను అన్ని పదవుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దేవేంద్ర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరాఖండ్ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎదురు చూస్తున్నారని దేవేంద్ర యాదవ్ ఈ క్రమంలో పేర్కొన్నారు. దుష్పరిపాలన, బీజేపీ నాయకత్వం కారణంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు.

రాజకీయ సవాళ్లను ఎదుర్కొని దేవభూమికి, ఉత్తరాఖండ్ ప్రజలకు సేవ చేయడం మనందరి కర్తవ్యమని దేవేంద్ర యాదవ్ లేఖలో పేర్కొన్నారు. కానీ, కిషోర్ ఉపాధ్యాయ ఈ పోరాటాన్ని బలహీనపరిచేందుకు, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలతో కుమ్మక్కయ్యారు. మరోవైపు, అన్ని పార్టీ పదవుల నుంచి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని కిషోర్ ఉపాధ్యాయ్ కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలియజేశారు. కిషోర్ ఉపాధ్యాయ్‌ను వ్యక్తిగతంగా ఎన్నిసార్లు హెచ్చరించినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఆపడం లేదని లేఖలో పేర్కొన్నారు. దీని కారణంగా కిషోర్ ఉపాధ్యాయ్‌ను అన్ని పార్టీ పదవుల నుండి తొలగించినట్లు దేవేంద్ర యాదవ్ పేర్కొన్నారు.

హరీష్ రావత్ అసెంబ్లీ సీటు మారింది అదే సమయంలో, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాష్ట్రంలో జరిగిన ప్రధాన పరిణామాలలో, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్థానాన్ని కాంగ్రెస్ మార్చింది . హరీష్ రావత్ ఇప్పుడు రామ్‌నగర్‌కు బదులుగా లాల్కువా నుంచి పోటీ చేయనున్నారు. ఆసక్తికరంగా, ‘ఒకే సీటు, ఒకే కుటుంబం’ అనే విధానాన్ని ధిక్కరిస్తూ హరిద్వార్ రూరల్ నియోజకవర్గం నుండి హరీష్ రావత్ కుమార్తె అనుపమ రావత్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.

Read Also….  Rahul Gandhi: నా గొంతు నొక్కేందుకు ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిః రాహుల్ గాంధీ