Coronavirus: కరోనా పేషెంట్‌కు పురుడు పోసిన డాక్టర్లు.. ప్రభుత్వ వైద్యులపై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రులు హరీష్, కేటిఆర్

Coronavirus: క‌రోనా పాజిటివ్‌గా తేలిన ఓ గ‌ర్భిణీకి విజ‌య‌వంతంగా డెలివ‌రీ చేశారు రాజ‌న్న సిరిసిల్లాలోని ఎల్లారెడ్డిపేట ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు. వివ‌రాల్లోకి వెళితే. ఎల్లారెడ్డిపేట ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో..

Coronavirus: కరోనా పేషెంట్‌కు పురుడు పోసిన డాక్టర్లు.. ప్రభుత్వ వైద్యులపై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రులు హరీష్, కేటిఆర్
Follow us

|

Updated on: Jan 27, 2022 | 8:05 AM

Coronavirus: క‌రోనా పాజిటివ్‌గా తేలిన ఓ గ‌ర్భిణీకి విజ‌య‌వంతంగా డెలివ‌రీ చేశారు రాజ‌న్న సిరిసిల్లాలోని ఎల్లారెడ్డిపేట ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు. వివ‌రాల్లోకి వెళితే. ఎల్లారెడ్డిపేట ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఓ గ‌ర్భిణీ వ‌చ్చింది. అయితే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆమెకు అప్ప‌టికే క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. దీంతో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించి డెలివ‌రీ చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా వైద్యులు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎల్లారెడ్డి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు ట్వీట్ చేశారు. మంత్రులు హ‌రీష్ రావు, కేటీఆర్‌ల‌తో పాటు క‌లెక్ట‌ర్ ఆఫీస్ ట్విట్ట‌ర్ ఖాతాల‌ను ట్యాగ్ చేస్తూ.. ఈ రోజు ఎల్లారెడ్డిపేట‌లో కోవిడ్‌19 సోకిన గ‌ర్భిణీకి డెలివ‌రి చేశాము. త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నారు. వారి ఆరోగ్యం దృష్ట్యా వెంట‌నే సిరిసిల్ల ఆసుప‌త్రికి త‌ర‌లిచాం అని రాసుకొచ్చారు.

దీంతో వైద్యులు చేసిన ఈ ట్వీట్‌పై మంత్రులు హ‌రీష్ రావు, కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ స్పందిస్తూ… గొప్ప ప‌ని చేశారు అని ట్వీట్ చేయ‌గా. హ‌రీష్ రావు వైద్య సిబ్బందికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించాల‌ని ఆశిస్తూ.. త‌ల్లి బిడ్డ ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నందుకు సంతోషం వ్య‌క్తం చేశారు.

Also Read: Diabetes: వృద్ధులు ప్రతి రోజు ఆ పని చేస్తే టైప్‌-2 డయాబెటిస్‌ అదుపులో.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

Bihar Protests: బీహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. రెండు రైళ్లకు నిప్పు పెట్టిన ఆర్ఆర్‌బీ అభ్యర్థులు..!