Corona Fear: కరోనా మృతుడి దహన సంస్కారాలను అడ్డుకున్న గ్రామస్థులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
Corona Fear in villagers: కరోనా మహమ్మారితో ప్రజలు గందరగోళానికి గురవ్తుతున్నారు. కరోనా వ్యాప్తి ఎలా ఉంటుంది అనేదానిపై ప్రజలకు ఇప్పటికీ అవగాహన లేదు. దీంతో ప్రతి విషయాన్నీ అనుమానంగా చూడటం మొదలు పెట్టారు.
Corona Fear in villagers: కరోనా మహమ్మారితో ప్రజలు గందరగోళానికి గురవ్తుతున్నారు. కరోనా వ్యాప్తి ఎలా ఉంటుంది అనేదానిపై ప్రజలకు ఇప్పటికీ అవగాహన లేదు. దీంతో ప్రతి విషయాన్నీ అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. ఈ అనుమానంతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన దీనికి రుజువు. కోవిడ్ -19 కారణంగా మరణించిన వ్యక్తి దహన సంస్కారాలను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని గ్రామస్తులు ఆపారు. మంటల నుండి వచ్చే పొగలు సమీప ప్రాంతాలలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందనీ, అలాగే అక్కడి నివాసితులకు కరోనా సోకుతుందనీ చెబుతూ వారీ పని చేశారు. ఈ సంఘటన జోధ్‌పూర్ లోని నాయపురా గ్రామంలో జరిగింది.
జోధ్‌పూర్‌లోని ఎండిఎం ఆసుపత్రిలో కరోనా బాధితుడు తిలోక్‌చంద్ సోని సోమవారం కోవిడ్ -19 చికిత్స పొందుతూ మరణించాడు. కోవిడ్ -19 ప్రోటోకాల్స్ ప్రకారం, కుటుంబ సభ్యుడు మృతదేహాన్ని తుది కర్మల కోసం లాల్సాగర్ లోని సమీప శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. మృతదేహంతో అంబులెన్స్ రాగానే, కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఈలోపు అక్కడికి కొంతమంది వచ్చి, మరణించిన వ్యక్తి కోవిడ్ పాజిటివ్ కావడంతో మృతదేహాన్ని వేరే చోట దహనం చేయమని కోరారు. దహన సంస్కారాల నుండి పొగలు వ్యాపించవచ్చని గ్రామస్తులు వారితో చెప్పారు. దీనివలన ఈ ప్రాంతంలో, అలాగే అక్కడకు సమీపంలో నివసించేవారికి కూడా కరోనా వ్యాపిస్తుందని దహన సంస్కారాలకు అడ్డు చెప్పారు. మృతుడి కుటుంబం గ్రామస్తులతో వాదించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ, దహన సంస్కారాలు ఆ స్థలంలో నిర్వహించడానికి వారు అంగీకరించలేదు. దీంతో చేసేది లేక చివరకు మృతదేహాన్ని దహనం చేయడానికి మృతుడి కుటుంబం నౌగారి గేట్‌లోని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానవాటికకు తీసుకువెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఈ సంఘటనపై తిలోక్‌చంద్ సోదరుడు మూల్‌చంద్ మాట్లాడుతూ, గ్రామస్తులను చాలాసేపు ఒప్పించటానికి ప్రయత్నించానని, కాని, వారు అసలు అంగీకరించాలేదనీ చెప్పారు. చివరికి అక్కడ నుంచి మృతదేహాన్ని మరొక శ్మశానవాటికకు తీసుకువెళ్ళానని చెప్పాడు.
Also Read: Covid-19: పాపం.. ఆ తండ్రికి ఎన్ని కష్టాలో.. ఓ కుమారుడికి అంత్యక్రియలు.. అంతలోనే మరో కుమారుడు