Covid19 Vaccine: దేశంలో 3వ దశ వ్యాక్సినేషన్ వేగవంతం.. టీకాల్లో 70 శాతం వారికే రిజర్వ్..!

అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం..దేశం విధానం. కరోనా మహమ్మారి దేశాన్ని హడలెత్తిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం అంటోంది టీవీ9.

Covid19 Vaccine: దేశంలో 3వ దశ వ్యాక్సినేషన్ వేగవంతం.. టీకాల్లో 70 శాతం వారికే రిజర్వ్..!
Coronavirus Vaccine In India
Follow us
Balaraju Goud

| Edited By: Team Veegam

Updated on: May 12, 2021 | 11:22 PM

Coronavirus vaccine in India: అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం..దేశం విధానం. కరోనా మహమ్మారి దేశాన్ని హడలెత్తిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం అంటోంది టీవీ9.

బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న వ్యాక్సినేషనల్‌ లెక్కలు చూద్దాం. దేశంలో ఇప్పటి వరకు 17 కోట్ల 43 లక్షల 84 వేల 125 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 13 కోట్ల 68 లక్షల 61 వేల 373 మందికి మొదటి డోస్ అందింది. ఇక 3 కోట్ల 75 లక్షల 22 వేల 752 మందికి రెండో డోస్ కూడా అందింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. వ్యాక్సినేషన్‌కు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 3 లక్షల 20 వేల 706 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.

ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ పూర్తైంది? అందులో మొదటి డోస్ వేసుకున్న వారు ఎంత మంది? రెండో డోస్ వేసుకున్న వారు ఎంత మంది అనే లెక్కలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 74 లక్షల 76 వేల 612 మంది. ఇందులొ తొలి డోసు తీసుకున్నవారు 54 లక్షల 53 వేల 180 మంది. సెకండ్‌ డోసు తీసుకున్నవారు 20 లక్షల 23 వేల 432 మంది. ఇందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు 62 లక్షల 43 వేల 234. కోవ్యాగ్జిన్‌ డోసులు తీసుకున్నవారు 12 లక్షల 34 వేల 378.

తెలంగాణలో ఇప్పటి వరకు 54 లక్షల 17 వేల 462 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 44 లక్షల, 25 వేల 181 మంది ఉన్నారు. సెకండ్‌ డోసు తీసుకున్నవారు 9 లక్షల 92 వేల 281 మంది. ఇందులో కోవీషీల్డ్‌ తీసుకున్నవారి సంఖ్య 47 లక్షల 44 వేల 454 మంది. కోవాగ్జిన్‌ తీసుకున్నవారు 6 లక్షల 73 వేల 8 మంది.

ఇప్పటి వరకు మొత్తం 20 కోట్ల 23 లక్షల 86 వేల 192 మంది వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో 13 కోట్ల 40 లక్షల 41 వేల 43 మంది 45 ఏళ్ల పైబడిన వారు కాగా.. 6 కోట్ల 83 లక్షల 45 వేల 149 మంది 18-44 ఏళ్ల వయస్సు వారు. 45 ఏళ్ల పైబడిన వారే ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 43 లక్షల 84 వేల 125 మందికి వ్యాక్సిన్ వేస్తే.. అందులో అగ్రభాగం కోవిషీల్డ్ వ్యాక్సిన్లే. ఇప్పటి వరకు అందిన వ్యాక్సిన్‌లలో 15 కోట్ల 72 లక్షల 16 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందింది. ఇక కోటి 71 లక్షల 84 వేల 109 మందికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక యజ్ఞంలా సాగుతోంది.

ఆరోగ్యంగా ఉండాలంటే.. కరోనాకు దూరంగా ఉండాలి. ఆ మహమ్మారి మనల్ని టచ్ చేయవద్దంటే.. వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. అందరికీ వ్యాక్సిన్.. అందిరికీ ఆరోగ్యం స్లోగన్‌ నినదిస్తోంది టీవీ9. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ఆవశ్యకతను మీకు గుర్తు చేస్తోంది. ఇవి దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాక్సినేషన్ లెక్కలు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచుతోంది టీవీ9.

Read Also…  Unauthorised vaccination: అస్సాంలో కోవిడ్ టీకా రెండు వేలు.. సమాంతర వ్యాక్సినేషన్ కేంద్రం నడుపుతున్న ఆరోగ్యకార్యకర్తలు!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!