AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black fungus : బ్లాక్ ఫంగస్ ముప్పుపై ముందే మేల్కొన్న భారత్.. మార్కెట్లో డ్రగ్ కొరత ఏర్పడకుండా ముమ్మర చర్యలు

Black fungus : కరోనా మహమ్మారి నుంచి ఎలాగోలా బయటపడ్డామని ఊపిరిపీల్చుకుంటున్నవేళ.. కోవిడ్-19 విజేతల్లో కొందరిపై దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ మీద భారత ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.

Black fungus : బ్లాక్ ఫంగస్ ముప్పుపై ముందే మేల్కొన్న భారత్.. మార్కెట్లో డ్రగ్ కొరత ఏర్పడకుండా ముమ్మర చర్యలు
Black Fungus
Venkata Narayana
|

Updated on: May 12, 2021 | 2:57 PM

Share

Black fungus treatment: కరోనా మహమ్మారి నుంచి ఎలాగోలా బయటపడ్డామని ఊపిరిపీల్చుకుంటున్నవేళ.. కోవిడ్-19 విజేతల్లో కొందరిపై దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ మీద భారత ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దేశంలో పలు చోట్ల (మ్యూకోర్‌మైకోసిస్) బ్లాక్ ఫంగస్ కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ఈ కొత్త మహమ్మారిని ఎదుర్కొనే ‘ఆంఫోటెరిసిన్-బీ’ డ్రగ్ లభ్యతను కేంద్ర ప్రభుత్వం పెంచే ప్రయత్నం చేస్తోంది. దేశీయంగా ఈ డ్రగ్ ఉత్పత్తి పెంచడంతో పాటు, దిగుమతులు చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. కాగా, బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు వైద్యులు ‘ఆంఫోటెరిసిన్-బీ’ అనే మందును సూచిస్తుండటంతో మార్కెట్లో ఈ డ్రగ్ కొరత ఏర్పడకుండా ముందు నుంచీ చర్యలు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఇలా ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్​ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ సోకుతుండటం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపు కోల్పోతున్నారు.

గత 16 రోజుల్లో సూరత్​లో 45 మందికి ఈ వ్యాధి సోకగా 9 మంది కంటి చూపు కోల్పోయారు. ఇక,​ మహారాష్ట్రలో ప్రస్తుతం 250 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనుషులకు అరుదుగా సోకే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్.. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడు రోజుల్లో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్​లో ఇది చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

Read also : RT-PCR పరీక్ష కూడా అంతంతేనా..! మ్యుటేషన్‌ కరోనా రకాలు అంతుచిక్కడం లేదట.. కొత్త లక్షణాలతో కోవిడ్ మహమ్మారి.?

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!