Liquor Sales: రికార్డు స్థాయిలో తెలంగాణ మద్యం అమ్మకాలు.. ఒకే షాపులో 3 గంటల్లో మూడున్న కోట్ల లిక్కర్ ఖాళీ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్ విధించటంతో మంగళవారం మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కరోజే దాదాపు రూ.125 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
Telangana Lockdown Effect: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్ విధించటంతో మంగళవారం మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కరోజే దాదాపు రూ.125 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లాక్‌డౌన్‌తో దుకాణాలు ఉండవని భావించిన మద్యం ప్రియులు… పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. అయితే, మద్యం దుకాణాలు కూడా ఉదయం 6 గంటలకే తెరుచుకుంటాయని అబ్కారీ శాఖ అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన కొద్ది క్షణాల్లోనే తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒక్కొక్క షాపు వద్ద వందలాది మంది గుమ్మికూడారు. తమ అవసరాలకు మించి మద్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10రోజుల లాక్ ప్రకటించబంతో మందుమాబులు పది రోజులకు సరిపడా మద్యాన్ని ముందుగానే తీసుకువెళ్లేందుకు వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. లాక్ డౌన్ ప్రకటన వెలుపడిన అనంతరమే మూడు గంటల వరకే రూ56 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయ్యింది. ఆ తరువాత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగడంతో సుమారు రూ125 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని రాష్ట్ర అబ్కారీ శాఖ వెల్లడించింది.
మే నెలలో ఇప్పటి వరకు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు అయితే.. నిన్న ఒక్కరోజు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు అని అధికారులు అంటున్నారు. మే నెల 10రోజుల్లో రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు సుమారు రూ.61 కోట్ల మేరకు అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయని దుకాణదారులు వెల్లడించారు.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా అమ్మకాలు జరగా.. వరుసగా నల్గొండలో రూ.15.24 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్లు, హైదరాబాద్‌లో రూ.10.17 కోట్ల విక్రయాలు జరిగాయి. రద్దీని బట్టి అదనంగా సరుకు తెప్పించుకున్నామని దుకాణదారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర అబ్కారీ అధికారులు సైతం అంది వచ్చిన అవకాశాన్ని వ్యాపారంగా మల్చుకున్నారు. రాష్ట్ర ఖజానాను పెంచుకునేందుకు ఇదే మంచి తరుణంగా భావించి.. డిపోల్లోనూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసిన అబ్కారీ శాఖ.. ఇండెంటు పెట్టిన వెంటనే మద్యం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.
ఇదిలావుంటే, లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం మద్యం దుకాణాల విషయంలో… మరింత చర్చించిన తర్వాత అన్నింటి మాదిరిగానే వీటిని కూడా తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్సైజ్ నిబంధనల మేరకు ఉదయం 10 గంటలలోపు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు తెరవకూడదు. కానీ, ఆ నిబంధనలు సడలించి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా మద్యం ద్వారా వచ్చే రాబడిపై లాక్‌డౌన్ ప్రభావం పడదని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.
గతంలో లాక్ డౌన్‌లో మాదిరిగా రోజుల తరబడి మద్యం దొరకదేమో అని భావించిన మద్యం ప్రియులు చేతికందినన్ని బాటిళ్లను కొనుక్కొని భద్రపర్చుకున్నారు. కరోనా కోరలు చాస్తున్న వేళ దాన్ని లెక్క చేయకుండా కనీసం భౌతిక దూరం పాటించకుండా ఎగబడి మద్యం కొనుగోలు చేశారు. అయితే, హైదరాబాద్‌లోని ఓ షాపులో అమ్ముడైన సరకు మొత్తం విలువ తల దిబ్బతిరిగిపోయింది. జూబ్లీహిల్స్‌లోని ఒక మద్యం షాపులో కేవలం 3 గంటల వ్యవధిలోనే రూ.3.5 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగిన నిర్వహకులు తెలిపారు. ఒక షాపులో ఇంత తక్కువ సమయంలో ఇంత అధిక మొత్తం అమ్ముడవడం ఇదే ఆల్ టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు.
Read Also…. ప్రజలకు షాకింగ్.. మరోసారి పెరగనున్న టీవీల ధరలు.. కారణం ఇదేనా..?