Lockdown: లాక్‌డౌన్ సమయంలో రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు.. ప్రజలు సహకారం అందించాలన్న సీపీ మహేష్ భగవత్
CP Mahesh Bhagat Warned: హైదరాబాద్‌లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రాచకొండ పరిధిలో లాక్ డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోందని రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు. ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని మనవి చేస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రాచకొండ పరిధిలో లాక్ డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోందని రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు. ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని మనవి చేస్తున్నామన్నారు. వ్యాపార సమూదాయలు 10 గంటలకే బంద్ చేశారన్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తప్పవని మహేష్ భగత్ హెచ్చరించారు. లాక్ డౌన్ పరిస్థితిని ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్ పిఎస్ ల పరిధిలలోని చెక్ పోస్ట్ లను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించి పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ లో మొత్తం 46చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది మూడు షిప్టులలో పనిచేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేళల్లో లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ కి ప్రజలు పూర్తి సహకారం అందించాలని మహేష్ భగవత్ కోరారు.
వ్యాపార సముదాయాలు ఉదయం పది గంటలకే మూసివేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రైతు బజార్, రేషన్ దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, షాపింగ్ మాల్స్ కి గుంపులుగా వెళ్లకూడదని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9490617234 కు ఫోన్ చేయాలని సీపీ కోరారు.