Covid-19: పాపం.. ఆ తండ్రికి ఎన్ని కష్టాలో.. ఓ కుమారుడికి అంత్యక్రియలు.. అంతలోనే మరో కుమారుడు
Noida Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగు వేలకు పైగా
Noida Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం పాజివిటి రేటు 90శాతానికి చేరింది. అయితే.. ఈ కరోనా మహమ్మారి చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి ప్రాణాలను బలిగొంటోంది. కుటుంబాలకు… కుటుంబాలనే పొట్టనబెట్టుకుంటోంది. చాలాచోట్ల హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని చూసి గుండె తరుక్కుపోతోంది. తాజాగా అటాంటి ఘటనే ఉతరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఓ కుమారుడి చితికి నిప్పు పెట్టిన సమయంలోనే మరో కుమారుడు కూడా మృతి చెందాడు. ఈ ఘటన నోయిడా సమీపంలోని జలాల్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
జలాల్ పూర్ గ్రామంలోని అత్తర్ సింగ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆ ఇద్దరికి ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. పంకజ్ అనే కుమారుడు కరోనాతో మంగళవారం ఉదయం మృతి చెందగా అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ సమయంలో రెండో కుమారుడు దీపక్ కూడా ఇంట్లో కుప్పకూలిపోయాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారుడు చనిపోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కాగా.. జలాల్ పూర్ గ్రామంలో కరోనాతో 14 రోజుల్లో 18 మంది మరణించారు.
Also Read: