CORONA POSITIVITY RATE: ఆందోళన కలిగిస్తున్న పాజిటివిటీ రేటు.. తాజా గణాంకాలతో అందరిలో షాక్
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంటే.. దానికి సంబంధించి ప్రతీ రోజులు వెల్లడవుతున్న గణాంకాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు రెండు నెలల క్రితం దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. ఆనాటి...
CORONA POSITIVITY RATE INCREASING IN INDIA: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) కరాళ నృత్యం చేస్తుంటే.. దానికి సంబంధించి ప్రతీ రోజు వెల్లడవుతున్న గణాంకాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు రెండు నెలల క్రితం దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. ఆనాటి నుంచి కొత్త రకం కరోనా (NEW VARIANT CORONA)కు సంబంధించి ఆందోళన కలిగించే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. డబుల్ మ్యూటెంట్ (DOUBLE MUTANT) అయిన కరోనా వైరస్ (CORONA VIRUS) శరవేగంగా దేశంలో విస్తరిస్తోందని గణాంకాలు చాటుతున్నాయి. తాజాగా వెల్లడైన లెక్కల్లో దేశంలోని 90 శాతం ఏరియాలో పాజిటివిటీ రేటు (POSITIVITY RATE) ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది.
రెండో దశ కరోనా వైరస్ ఉధృతిని అంఛనా వేసేందుకు పలు సంస్థలు దేశవ్యాప్తంగా వివిధ మార్గాలలో సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేల ఫలితాలను గమనిస్తే.. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా వున్నట్లు తేలింది. మన దేశంలో దాదాపు 90 శాతం ప్రాంతంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ (UNION HEALTH MINISTRY) ప్రకటించింది. దేశంలో మొత్తం 734 జిల్లాలుండగా వాటిలో 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 5 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు సగటున 21 శాతం వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మే 12న వెల్లడించింది.
కరోనా పాజిటివిటీ రేటు అధికంగా వున్న రాష్ట్రాలలో గోవా (GOA) ప్రథమ స్థానంలో వుంది. ఆ తర్వాత పుదుచ్ఛేరి (PUDUCHCHERY), బెంగాల్ (BENGAL), హర్యానా (HARYANA), కర్నాటక (KARNATAKA) రాష్ట్రాల్లో అధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. గోవాలో కొత్త కేసుల పాజిటివిటీ రేటు ఏకంగా 48 శాతంగా నమోదైంది. హర్యానాలో ఇది 37 శాతంగా రికార్డయ్యింది. మరోవైపు నాగాలాండ్ (NAGALAND), హిమాచల్ ప్రదేశ్ (HIMACHAL PRADESH) రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు ఇపుడిపుడే పెరుగుతున్న సంకేతాలు అందుతున్నాయి. మొన్నటి దాకా కరోనా విలయ తాండవం చేసిన ఢిల్లీ (DELHI), మహారాష్ట్ర (MAHARASHTRA), చత్తీస్‌గఢ్ (CHATTISGARH) రాష్ట్రాలలో రోజు వారీ కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు బెంగళూరు అర్బన్ (BENGALURU URBAN), చెన్నై (CHENNAI), ఎర్నాకులం (ERNAKULAM), మలప్పురం (MALAPPURAM) జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పాజిటివిటీ శాతం 10కి మించితే ఆయా ప్రాంతాల్లో సంపూర్ణంగా లాక్ డౌన్ (TOTAL LOCK DOWN) విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. అయితే.. మెజారిటీ రాష్ట్రాలు ప్రస్తుతం సంపూర్ణ లాక్ డౌన్లు విధించాయి. కొన్ని మాత్రం పాక్షిక లాక్ డౌన్‌లతో ప్రయోగాలు చేస్తున్నాయి.
ALSO READ: మళ్ళీ కుదేలవుతున్న విమానయాన రంగం.. సెకెండ్ వేవ్ దెబ్బకు ఢమాల్