Corona Deaths: దేశంలో కల్లోల’మే’.. మొత్తం కరోనా మరణాల్లో 33 శాతం మేనెల లోనే! దారుణంగా దెబ్బతీసిన రెండో వేవ్
Corona Deaths: కరోనా కల్లోలమే సృష్టించింది. దేశవ్యాప్తంగా ఒక్క మే నెలలోనే అత్యధిక మంది మరణం పాలయ్యారు. ఒక్కసారిగా విరుచుకుపడి.. ఊపిరి తీసేసింది కరోనా రెండో వేవ్.
Corona Deaths: కరోనా కల్లోలమే సృష్టించింది. దేశవ్యాప్తంగా ఒక్క మే నెలలోనే అత్యధిక మంది మరణం పాలయ్యారు. ఒక్కసారిగా విరుచుకుపడి.. ఊపిరి తీసేసింది కరోనా రెండో వేవ్. అది మరణాల ఉప్పెనలా మారింది. ప్రతి రోజు వేలాదిమంది మరణించారు. కరోనా వ్యాపించడం ప్రారంభం అయినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 33 శాతం ఒక్క మే నెలలోనే కావడం గమనార్హం. అదేవిధంగా కోవిడ్ కేసుల నమోదులో కూడా మే నెల రికార్డులు సృష్టించింది. ఒక నెలలో ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అయింది మే నెలలోనే. ఈ నెల మొత్తం దాదాపు 90.3 లక్షల కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి మేనెల ఎంత అల్లకల్లోలాన్ని ప్రజల ఆరోగ్యాల్లో సృష్టించిందో తెలుస్తుంది.
మే నెల కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి..
- మే నెలలో నమోదైన మరణాల సంఖ్య దాదాపు 1.2 లక్షలు. ఏ దేశంలోనైనా ఒక నెలలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. అక్కడ ఈ ఏడాది జనవరిలో 99,680 మరణాలు చోటుచేసుకున్నాయి.
- ఇక ఈ నెలలో గంటకు దాదాపు 165 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మే నెలలో భారత్‌లో దాదాపు ప్రతి రోజూ 3,400కుపైగా మరణాలు చోటుచేసుకోగా.. కనీసం 13 రోజులు 4 వేలకుపైగా మృతుల సంఖ్య నమోదైంది.
- మే 19న రికార్డు స్థాయిలో 4,529 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే.
- 2020లో భారత్‌లో నమోదైన మరణాల సంఖ్య 1.48 లక్షలు. ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ఇంతే సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.
- ఇక దేశ రాజధాని దిల్లీలో మరణాల రేటు మే నెలలో ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ మరణాల రేటు 2.9 శాతం కాగా.. దేశ సరాసరి(1.3 శాతం)తో పోల్చితే ఇది రెండు రెట్ల కంటే ఎక్కువ. దిల్లీలో మే నెలలో 8,090 మరణాలు చోటుచేసుకున్నాయి. దాదాపు 2.8 లక్షల కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్‌లో 2.8, ఉత్తరాఖండ్‌లో 2.7 శాతాలతో జాతీయ సరాసరి కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి
Also Read: Corona Effect: కరోనా దెబ్బతో తమ పదవులు వదులుకోవాల్సి వచ్చిన వివిధ దేశాల మంత్రులు..ఎందుకో తెలుసా?