AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect: కరోనా దెబ్బతో తమ పదవులు వదులుకోవాల్సి వచ్చిన వివిధ దేశాల మంత్రులు..ఎందుకో తెలుసా?

Corona Effect: ఉరుము లేని పిడుగులా విరుచుకుపడిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా దెబ్బతింది. దాదాపుగా అన్నిదేశాలూ కరోనా దెబ్బతో కుదేలు అయిపోయాయి.

Corona Effect: కరోనా దెబ్బతో తమ పదవులు వదులుకోవాల్సి వచ్చిన వివిధ దేశాల మంత్రులు..ఎందుకో తెలుసా?
Corona Effect
KVD Varma
|

Updated on: Jun 02, 2021 | 11:21 PM

Share

Corona Effect: ఉరుము లేని పిడుగులా విరుచుకుపడిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా దెబ్బతింది. దాదాపుగా అన్నిదేశాలూ కరోనా దెబ్బతో కుదేలు అయిపోయాయి. ఆయా దేశాలు కరోనా కట్టడి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా, కరోనా వేగం ముందు అవి పనిచేయలేదు. అయితే, చాలా దేశాల్లో కరోనా వ్యాప్తికి ప్రభుత్వాలే కారణమని ప్రజలు దుయ్యబడుతూ వస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో మంత్రులు అలసత్వం చూపించారని ప్రజలు విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని దేశాల్లో ఆరోగ్యశాఖ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సివచ్చింది. ప్రజలకు సమాధానం చెప్పడం కోసం.. తమ వైఫల్యాన్ని అంగీకరిస్తూ చాలా దేశాల్లో ఆరోగ్యశాఖ మంత్రులు రాజీనామాలు చేశారు.

బ్రెజిల్ లో ప్రధాని బొల్సొనారోకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో పౌరులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నాలుగుసార్లు ఆరోగ్యశాఖ మంత్రిని మార్చారు.

వైరస్‌ కట్టడికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బ్రిజిల్‌లో భారీ సంఖ్యలో పౌరులు రోడ్లమీదకు వచ్చి ప్రధాని బొల్సొనారోకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నాలుగు సార్లు ఆరోగ్యశాఖ మంత్రిని మార్చాల్సి వచ్చింది. బ్రెజిల్‌లోనే కాకుండా మరికొన్ని దేశాల్లోనూ కరోనా నియంత్రణలో అక్కడి ఆరోగ్యశాఖ మంత్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో వారి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

అర్జెంటీనా లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో ఇక్కడ ఆరోగ్యశాఖ మంత్రి గైన్స్‌ గొంజాలెజ్‌ గర్సియా తన పదవిని వీడుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు.

జోర్డాన్‌ లో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో చాలా ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా జోర్డాన్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి నాజిర్‌ ఒబియదత్‌ ప్రకటించారు.

పెరూలో 19 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 69వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి రాకముందే పెరూ మాజీ అధ్యక్షుడు మార్టిన్‌ విజ్‌కర్రా టీకా తీసుకున్నారని తేలింది. దీన్ని వ్యాక్సిన్‌ స్కాండల్‌గా పేర్కొంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో పెరూ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ పిలార్‌ మజెట్టీ తన పదవికి రాజీనామా చేశారు.

ఇరాక్‌ లో ఓ కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ ట్యాంకు పేలిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది. ఇందుకు బాధ్యత వహిస్తూ ఇరాక్‌ ఆరోగ్యశాఖ మంత్రి హస్సన్‌ ఆన్‌-తమీమీ తన పదవికి రాజీనామా చేశారు. ఆస్ట్రియా లో కరోనా కట్డడికి కృషి చేసిన ఆస్ట్రియా ఆరోగ్యశాఖ మంత్రి రుడోల్ఫ్‌ ఆన్‌షోబెర్‌ కూడా ఏప్రిల్‌ 13న తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కరోనా విజృంభణ సమయంలో అధిక సమయం పనిచేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈక్వెడార్‌ లో కరోనా కట్టడి, వ్యాక్సిన్‌ పంపిణీ వ్యవహారంలో సరిగా స్పందించని కారణంగా ఈక్వెడార్‌ ఆరోగ్యశాఖ మంత్రి రొడొల్ఫో ఫార్ఫాన్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం నెల రోజుల్లోనే ఆయన ఆరోగ్యశాఖకు రాజీనామా చేశారు.

మంగోలియా లో కరోనా వైరస్‌ సోకిన ఓ మహిళతో పాటు చిన్నారికి చికిత్స చేసే విషయంలో ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలతో మంగోలియాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనతో కేబినెట్‌ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఘటనకు తాను బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అందుచేత కేబినెట్‌ మొత్తం రద్దు చేస్తున్నట్లు మంగోలియన్‌ ప్రధానమంత్రి ఖురేల్‌సుఖ్‌ ఉఖ్‌నా ప్రకటించారు. అప్పుడే జన్మనిచ్చిన తల్లిని మరోచోటుకి తరలించడంలో తప్పు జరిగిందని ప్రధాని అంగీకరించారు.

స్లొవాకియా లో కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడంలో స్లొవాకియా ప్రభుత్వం విఫలమయ్యిందని అక్కడి విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కరోనా నియంత్రణలో విఫలం కావడంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో స్లొవాకియా ఆరోగ్యశాఖ మంత్రి మారెక్‌ క్రాజి తన పదవికి రాజీనామా చేశారు.

Also Read: Foreign Covid Vaccines: విదేశీ టీకాలపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో అందుబాటులోకి రానున్న మరిన్ని వ్యాక్సిన్లు..!

Myocarditis With Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్‌తో గుండె మంట.. ఇజ్రాయెల్‌ తాజా అధ్యయనంలో వెల్లడి..!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై