AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Crisis: కరోనా ఎఫెక్ట్.. బస్సులను కిలో రూ. 45 చొప్పున అమ్మేసిన ట్రావెల్ యజమాని.. ఎక్కడంటే..

Corona Crisis: రెండేళ్ళ క్రితం ప్రపంచంలో అడుగు పెట్టిన కోవిడ్(Covid 19 )మహమ్మారి మానవ జీవితాన్ని అతాకుతలం చేసింది. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా అనేక రంగాలపై కోలుకోలేని దెబ్బతీసింది. పర్యాటక రంగం,..

Corona Crisis: కరోనా ఎఫెక్ట్.. బస్సులను కిలో రూ. 45 చొప్పున అమ్మేసిన ట్రావెల్ యజమాని.. ఎక్కడంటే..
Corona Crisis
Surya Kala
|

Updated on: Feb 13, 2022 | 9:39 PM

Share

Corona Crisis: రెండేళ్ళ క్రితం ప్రపంచంలో అడుగు పెట్టిన కోవిడ్(Covid 19 )మహమ్మారి మానవ జీవితాన్ని అతాకుతలం చేసింది. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా అనేక రంగాలపై కోలుకోలేని దెబ్బతీసింది. పర్యాటక రంగం, హోటల్స్ వంటి పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. పలురంగాల్లోని వ్యాపారస్తులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కరోనా కారణంగా కదలని బస్సు.. ఇక పనిచేసే వీలులేకపోవడంతో.. ఆ బస్సు టాప్ ల మీద మొక్కలను పెంచుతున్నది ఒకరైతే.. ఒకరు తమ బస్సులు కరోనా సమయంలో నడవక పోవడంతో భారీ నష్టాల బారిన పడి ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఆబస్సులను ఏమి చెయ్యాలో తెలియక తుక్కు కింద జమ చేస్తూ.. ఏకంగా కిలోల చొప్పున అమ్మ్కున్నాడు. దీంతో ఆ వ్యాపారస్తుడి దయనీయ స్థితి అద్దం పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హృదయాలను కదిలించే ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణాదిలో ఫేమస్ పర్యాటక ప్రాంతం కేరళ. కరోనా మహమ్మారి కారణంగా ఇక్కడ బస్సులు నడవక పర్యాటక బస్సు యజమానులు భారీగా నష్టపోయి రోడ్డున పడ్డారు. కోచి కేంద్రంగా ‘రాయ్‌’ టూరిజం పేరుతో పర్యాటక బస్సులను నడిపే రాయ్‌సన్‌ జోసెఫ్‌ వద్ద 20 బస్సులు ఉండేవి. అయితే జోసెఫ్ కూడా ఇప్పుడు కరోనా బాధితుడే. కారోనా కారణంగా విధించిన ప్రయాణ ఆంక్షలతో భారీ నష్టపోయిన జోసెఫ్ తనకున్న 20 బస్సుల్లో 10 బస్సులను అమ్మేశాడు. ఆ బస్సులను తుక్కుగా లెక్కలోకి తీసుకుని కిలో 45 రూపాయలకు కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు జోసెఫ్.

కరోనా వలన విధించిన ప్రయాణ ఆంక్షలతో తీవ్రంగా నష్టపోయానని.. రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువ అవడంతో దిక్కుతోచని స్థితిలో తాను తన బస్సులను అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు. ఇప్పుడు నడుస్తున్న బస్సుల రాబడి అంతంత మాత్రమే నని గత 21 రోజుల్లో కేవలం మూడు బస్సులు మాత్రమే మున్నార్ ట్రిప్ కు వెళ్లాయని.. చేసేది ఏమీ లేక ఇప్పుడు బస్సులను అమ్మకానికి పెట్టినల్టు చెప్పాడు.

అయితే ఈ విషయంపై కేరళలోని బస్సు యజమానుల సంఘం కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీసీఓకే) స్పందిస్తూ.. ఈ పరిస్థితి కేవలం ఒక్క జోసఫ్ ది ఒక్కరిది మాత్రమే కాదని.. పలువురు ట్రావెల్ యజమానులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇప్పటికే పలు బస్సులను వడ్డీ వ్యాపారస్తులు,బ్యాంకులు జప్తు చేసుకున్నాయని.. మరిన్ని బస్సులు జప్తు చేసుకునే అవకాశం ఉందని సీసీఓకే చెప్పింది.

Also Read:

అందుకే రాజ్యాంగం మార్చాలన్నాను..అందులో తప్పేముంది? కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌..