Mamata Banerjee: బీజేపీని ఎదుర్కోవాలంటే కోర్ గ్రూప్ ని ఏర్పాటు చేయాల్సిందే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేయాల్సిందేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్న వర్చ్యువల్ గా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మమత..
2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేయాల్సిందేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్న వర్చ్యువల్ గా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మమత..ఇలాంటి గ్రూప్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించాలన్నారు. ఇదే విషయాన్ని లోక్ తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ తెలియజేస్తూ.. అన్ని సంస్థలూ బీజేపీని సమర్థిస్తున్న ఈ తరుణంలో దాన్ని ఎదుర్కోవడానికి అన్ని విపక్షాల ఐక్యతతో కూడిన కోర్ గ్రూప్ ఏర్పాటు అనివార్యమని, ప్రతి మూడు, నాలుగు రోజులకొకసారి ఈ గ్రూప్ సమావేశం కావాలని ఆమె కోరారని చెప్పారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పెద్ద పార్టీ గనుక ఈ గ్రూపునకు సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ అధ్యక్షత వహించాలని ఆమె అభిప్రాయపడ్డారన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతివారు కూడా ఇందుకు అంగీకరించారన్నారు. అటు- దేశ ఎకానమీని ప్రధాని మోదీ నాశనం చేస్తున్నారని ఈ సమావేశం ఆరోపించింది. పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జుడిషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ మరింత త్వరగా జరగాలని, ఆదాయం పన్ను పరిధిలోలేని ప్రతి కుటుంబానికి నెలకు 7.500 రూపాయల ఆర్ధిక సాయం చేయాలని, వివాదాస్పదమైన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని ఈ మీటింగ్ ప్రభుత్వాన్ని కోరింది.
సెప్టెంబరు 20 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా ఉమ్మడిగా నిరనస ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ తరువాత ఓ సంయుక్త ప్రకటనలో విపక్షాలు తెలిపాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ ప్రొటెస్ట్ ఉండాలని తీర్మానించాయి. పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సయిజు సుంకాన్ని తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: రాహుల్ హత్యకేసులో సంచలన నిజాలు.. స్పీడ్ అందుకున్న ఇన్విస్టిగేషన్..:Rahul Murder Mystery Live Video.
Local to global Video: రాహుల్ హత్యకేసు మరియు నకిలీ చలానా కేసులో కదులుతున్న డొంక..(వీడియో).
బిల్డింగ్ పై నుంచి కుక్క జంప్.. క్యాచ్ పట్టి కుక్కను బలె కాపాడాడు.!వైరల్ వీడియో:Dog Viral Video.