కోవిడ్ వేవ్ అదుపునకు దేశంలో లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించండి..కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
దేశంలో సెకండ్ కోవిడ్ వేవ్ అదుపునకు లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతి రోగికి ఆసుపత్రుల్లో అడ్మిషన్ లభించేలా చూడాలని,..

దేశంలో సెకండ్ కోవిడ్ వేవ్ అదుపునకు లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతి రోగికి ఆసుపత్రుల్లో అడ్మిషన్ లభించేలా చూడాలని, అలాగే అత్యవసర మందుల లభ్యతపై దృష్టి పెట్టాలని, ఈ దిశగా ఓ నేషనల్ పాలసీని రూపొందించాలని సూచించింది. ఇందుకు రెండు వారాల వ్యవధిని ఇచ్చింది. జస్టిస్ వై.వీ.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు,జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన బెంచ్ ఈ సూచనలు చేసింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ పాటించేలా చూడాలని కూడా పేర్కొంది. హాస్పిటల్స్ లో బెడ్ లభించడమన్నది అతి పెద్ద సవాలుగా మారిందని, వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రులు వివిధ ప్రమాణాలను పాటించడం కూడా జటిల పరిస్థితికి దారి తీస్తోందని బెంచ్ పేర్కొంది. దీనివల్ల అనిశ్చితి,గందరగోళం ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద తనకు గల అధికారాలను కేంద్రం వినియోగించుకోవాలని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కూడా పేర్కొంది.
ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఎమర్జెన్సీ స్టాకుల లొకేషన్ ని వికేంద్రీకరించాలని, 4 రోజుల్లోగా ఈ స్టాకులను ఏర్పాటు చేయాలనీ బెంచ్ సూచించింది. ఆక్సిజన్ సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఢిల్లీ నగరానికి ప్రాణవాయువు లోటును తీర్చేందుకు తక్షణం పూనుకోవాలని, ఈ నెల 3 అర్ధరాత్రిలోగా ఓ కార్యాచరణను రూపొందించాలని బెంచ్ ఆదేశించింది. నగరంలోని హాస్పిటల్స్ వరుసగా 10 రోజులుగా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే సమయం మించిపోయింది, ఇక జాప్యం చేయరాదని న్యాయమూర్తులు ఆదేశించారు. అటు కేసుల అదుపునకు లాక్ డౌన్ విధించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిపుణులు,టాస్క్ ఫోర్స్ సభ్యులు సైతం అభిప్రాయపడ్డారు మరిన్ని చదవండి ఇక్కడ : మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …



