AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో తొలి కోవిడ్ సెంటర్ గా కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్, ఆక్సిజన్ ప్లాంట్ కూడా, ఇక రోగులకు శీఘ్ర సేవలు

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఢిల్లీలో తొలి ఆక్సిజన్ ప్లాంట్ తో కూడిన కోవిడ్ సెంటర్ ఏర్పాటైంది. కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్ నే ఇలా మార్చేశారు. రోజుకు 1500 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి...

ఢిల్లీలో తొలి కోవిడ్ సెంటర్ గా కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్, ఆక్సిజన్ ప్లాంట్ కూడా, ఇక రోగులకు శీఘ్ర సేవలు
Common Wealth Games Village As Covod Centre In Delhi
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 03, 2021 | 11:18 AM

Share

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఢిల్లీలో తొలి ఆక్సిజన్ ప్లాంట్ తో కూడిన కోవిడ్ సెంటర్ ఏర్పాటైంది. కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్ నే ఇలా మార్చేశారు. రోజుకు 1500 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఇందులో ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హాస్పిటల్స్ లో బెడ్స్ అన్నింటినీ ఈ ప్లాంటుకు కనెక్ట్ చేసినట్టు వారు చెప్పారు. దీంతో రోగులకు నేరుగా, సుళువుగా ఆక్సిజన్ అందుతుందని వారు చెప్పారు. విదేశాల నుంచి ఆక్సిజన్ ఈక్విప్ మెంటును తెప్పించినట్టు వారు వెల్లడించారు. నగరంలోని పిల్లల ఆసుపత్రులకు కూడా ఆక్సిజన్ కొరత తలెత్తింది. నలుగురు చిన్నారులతో సహా 50 మంది రోగులు రిస్క్ ఎదుర్కొంటున్నారని, వారికీ వెంటనే ఆక్సిజన్ అవసరమని స్థానిక మధుకర్ రైన్ బో హాస్పటల్ నిన్న అత్యవసరంగా ఎస్ ఓ ఎస్ పంపింది. ఇప్పటివరకు పిల్లల ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత రాలేదు. కానీ మొదటిసారిగా  ఈ హాస్పటల్ ఎస్ ఓ ఎస్ మెసేజ్ పంపింది. తమకు 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను మాత్రం కేంద్రం కేటాయించింది. గత శుక్రవారం తమకు కేవలం 312 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రం అందిందని ప్రభుత్వం పేర్కొంది.

ఇలా ఉండగా కామన్ వెల్త్ గేమ్స్ విలేజీలుగా లోగడ ప్రకటించిన సెంటర్లను .గ్రౌండ్స్ ను తాము తప్పనిసరి పరిస్థితుల్లో కోవిడ్ సెంటర్లుగా  మార్చాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించేవారు.  దేశ క్రీడాకారులతో బాటు  విదేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు కూడా  ఈ పోటీల్లో పాల్గొనేవారు. ఆటగాళ్ల మైదానాలు ఇప్పుడు కోవిద్ సెంటర్లుగా మారిపోయాయి. మరిన్ని విలేజీలను ఇలా సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.కాగా-విదేశాల నుంచి ఇండియాకు ఆక్సిజన్, ఇతర వైద్య సంబంధ సహాయం అందుతోంది. మరిన్ని చదవండి ఇక్కడ : మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …

బాలయ్య ‘అఖండ’ పైనే ప్రజ్ఞ జైస్వాల్ ఆశలు అన్ని.. Pragya Jaiswal video.