AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: ఐదు రాష్ట్రాల ఓటమిపై కాంగ్రెస్‌లో అంతర్మథనం.. ఇవాళ్టి సీడబ్యూసీ భేటీలో సోనియా, రాహుల్ కీలక నిర్ణయం!

ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం కారణంగా కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది. ఈనేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశమవుతోంది. అయితే, అంతకంటే ముందే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) భేటీ కాబోతోంది.

Congress: ఐదు రాష్ట్రాల ఓటమిపై కాంగ్రెస్‌లో అంతర్మథనం.. ఇవాళ్టి సీడబ్యూసీ భేటీలో సోనియా, రాహుల్ కీలక నిర్ణయం!
Sonia Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: Mar 13, 2022 | 6:50 AM

Share

Congress Party Meeting: ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం కారణంగా కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది. ఈనేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశమవుతోంది. అయితే, అంతకంటే ముందే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) ఈరోజు ఉదయం 10.30 గంటలకు 10 జనపథ్‌లో పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్(Party Parliamentary Strategy Group) సమావేశవుతోంది. కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఈ రెండు సమావేశాల్లో ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన, ఓటమికి గల కారణాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమీక్షించవచ్చు. దీంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై చర్చించనున్నారు.

ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం కారణంగా కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది. ఈ ఓటమి తర్వాత, పార్టీ జి 23 గ్రూపులోని పలువురు నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తదుపరి వ్యూహంపై చర్చించారు. రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏం చర్చించారనే దానిపై ప్రస్తుతం ఈ నేతల నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు.

403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ కూటమి 273 సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ఎస్పీ కూటమికి 125 సీట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీఎస్పీకి ఒకటి, ఇతరులకు 2 సీట్లు వచ్చాయి. అదే సమయంలో, 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో, ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్‌కు 18 సీట్లు మాత్రమే వచ్చాయి. శిరోమణి అకాలీదళ్‌కు మూడు సీట్లు, భారతీయ జనతా పార్టీకి రెండు సీట్లు వచ్చాయి. అదే సమయంలో, బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌, అమరీందర్‌ సింగ్‌ సహా పలువురు బలమైన నేతలు ఎన్నికల్లో తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు.

మరోవైపు 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 47 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు 19 సీట్లు రాగా, ఇతరుల ఖాతాలో 4 సీట్లు వచ్చాయి. గోవాలోని మొత్తం 40 శాసనసభ స్థానాలకు గాను 20 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమికి 12 సీట్లు వచ్చాయి. ఇది కాకుండా ఆప్‌కి రెండు సీట్లు రాగా, 6 సీట్లు ఇతరుల ఖాతాలోకి వెళ్లాయి. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 32 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 5, ఎన్‌పీపీకి 7, ఎన్‌పీఎఫ్‌కు 5, ఇతరులకు 11 సీట్లు వచ్చాయి.

Read Also….  

AAP: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ఆ రెండు రాష్ట్రాలపై కేజ్రీవాల్ పార్టీ ఫోకస్..