పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్.. తిప్పికొట్టలని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచన.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. పెగాసస్ వివాదం, రైతుల నిరసన తదితర సమస్యలపై సభల్లో చర్చ జరగకుండా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాటిమాటికీ రభస సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.

పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్న  కాంగ్రెస్.. తిప్పికొట్టలని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచన.
Congress Not Letting Parliament Run Says Pm Modi

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. పెగాసస్ వివాదం, రైతుల నిరసన తదితర సమస్యలపై సభల్లో చర్చ జరగకుండా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాటిమాటికీ రభస సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ సెషన్ లో వీటి పరిష్కారానికి జరిగే అన్ని ప్రయత్నాలనూ ప్రతిపక్ష సభ్యులు నీరు గారుస్తున్నారని అన్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు గత వారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించగా దాన్ని కాంగ్రెస్ బాయ్ కాట్ చేసిందని, ఇతర విపక్షాలను కూడా అడ్డుకుందని మోదీ పేర్కొన్నారు.వీరి ప్రవర్తనను బీజేపీ ఎంపీలు మీడియా ఎదుట, ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

ఈ నెల 18 న పెగాసస్ వివాదం మొదలైనప్పటి నుంచి పార్లమెంట్ ఉభయ సభలూ ఏ సమస్యపైనా ఎలాంటి చర్చనూ చేపట్టలేకపోయాయి. విపక్షాల రభస కారణంగా లోక్ సభ, రాజ్యసభ పలు మార్లు వాయిదా పడుతూ వచ్చాయి. రాజ్య సభలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతి నుంచి పెగాసస్ సంబంధ పత్రాలను తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శంతను సేన్ లాక్కుని చించివేసి డిప్యూటీ చైర్మన్ వైపు ముక్కలను విసిరివేశారు, నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ శిరోమణి అకాలీదళ్ సహా ఇతర విపక్షాలు సభలో గందరగోళాన్ని సృష్టించాయి. అయితే ఇదే సమయంలో తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు పెగాసస్ పైన, రైతుల నిరసన వంటివాటిపైన చర్చ జరగాలన్న తమ డిమాండును ప్రభుత్వం తోసిపుచ్చుతోందని విపక్ష సభ్యులు దుయ్యబడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : వధువుకి గులాబ్‌ జామ్‌ ఇచ్చేందకు వరుడు తిప్పలు..!వధువులు ఎం చేసిందో చుడండి..వైరల్ వీడియో:Viral Video.

 రేషన్ కార్డు పంపిణిలో రగడ.. స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ చేసిన మంత్రులు..(వీడియో):Minister Vs MLA Video.

 ట్రైన్‌ కింద ప్రయాణికుడు…సూపర్‌ మ్యాన్‌ పోలీస్‌ రెస్క్యూ !వైరల్ అవుతున్న వీడియో..:Passenger Viral Video.

 భర్త చేసిన పాడు పనికి హీరోయిన్ రాజీనామా..ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు..:Shilpa Shetty video.

Click on your DTH Provider to Add TV9 Telugu