దొంగ అనుకుని ప్రభుత్వోగిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం.. పోలీసుల ఘనకార్యం.. ఎక్కడంటే?

ముంబై పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమయ్యింది.  పొరబాటున ఓ ప్రభుత్యోగిని దొంగగా భావించిన పోలీసులు.. ఆయన్ను తమ అదుపులోకి తీసుకుని చితకబాదారు.

దొంగ అనుకుని ప్రభుత్వోగిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం.. పోలీసుల ఘనకార్యం.. ఎక్కడంటే?
Mistaken For A Thief
Follow us

|

Updated on: Jul 27, 2021 | 1:41 PM

ముంబై పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమయ్యింది.  పొరబాటున ఓ ప్రభుత్యోగిని దొంగగా భావించిన పోలీసులు.. ఆయన్ను తమ అదుపులోకి తీసుకుని చితకబాదారు. నేను దొంగ కాదు మొర్రో అని మొత్తుకున్నా వాళ్లు వినిపించుకోలేదు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని భయన్దార్ రైల్వే స్టేషన్ వద్ద రెండ్రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్‌ను దొంగ కత్తితో బెదిరించి లూటీ చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆటో డ్రైవర్.  ఆటో డ్రైవర్‌ను లూటీ చేసిన దొంగ కోసం పోలీసులు ఆ రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ దొంగ ఇతనేనని భావిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ – జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(JNPT)‌లో పనిచేస్తున్న 53 ఏళ్ల ఉద్యోగి (అగస్టిన్)ని భయన్దార్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కాలర్ పట్టుకుని పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెల్లారు. తనను లూటీ చేసిన వ్యక్తి ఇతనేనని ఆటో డ్రైవర్ కూడా చెప్పడంతో లాఠీలు, బెల్ట్‌లతో ఆ వ్యక్తిని చితకబాదారు. తాను దొంగకాదని ప్రభుత్యోగినంటూ చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు తాము పొరబాటున మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్న విషయం పోలీసులకు కాస్త ఆలస్యంగా అర్థమయ్యింది. ఆయన్ను తమ కస్టడీ నుంచి విడిచిపెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.

గత గురువారంనాడు అర్థరాత్రి ఆఫీస్‌లో పని ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బాధితుడు అగస్టిన్ తెలిపారు. తాను ఎలాంటి నేరం చేయకున్నా… థర్డ్ డిగ్రీ ప్రయోగంతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారంటూ వాపోయారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బెల్టులు, లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కళ్లు, ముఖం, వీపు, కాళ్లపై గాయాలైనట్లు చెప్పారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి తాను నడవలేకపోతున్నట్లు చెప్పారు. దెబ్బలు తినొద్దంటే నేరాన్ని అంగీకరించాలంటూ కానిస్టేబుళ్లు ఒత్తిడి తీసుకొచ్చినా..తాను అంగీకరించలేదని చెప్పారు. తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు ప్రభుత్యోగిని పోలీస్ కానిస్టేబుళ్లు చిత్రహింసలకు గురిచేసిన ఘటనను పోర్ట్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు, హక్కుల సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్యోగిని అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్‌లో అగస్టిన్‌పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు పోలీస్ సీనియర్ ఇనిస్పెక్టర్ ముగుత్రావ్ పాటిల్ తెలిపారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు. ప్రభుత్వోగిని అక్రమంగా అదుపులోకి తీసుకుని చితకబాదిన ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ పోలీస్ కమిషనర్(జోన్ 1) అమిత్ కాలే తెలిపారు. ఈ ఘటనపై నివేధిక సమర్పించాలని భయన్దార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇనిస్పెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేధిక ఆదారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొరబాటున ప్రభుత్యోగిని దొంగగా భావించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల ఘనకార్యం ముంబైలో చర్చనీయాంశంగా మారింది.

Also Read..

ఈ జింక ఫర్మార్మెన్స్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే.. వీడియో చూస్తే మీరే అదుర్స్ అంటారు..

అమ్మో.. ఇదెక్కడి కోతిరా బాబు.. తన్నేసిందిగా.. పరేడ్ గ్రౌండ్స్‌లో కోతి చేసిన పని..

ఏటీఎం కార్డు పై 16 అంకెల సంఖ్య ఎందుకు ఉంటుంది..? ఈ అంకెల రహస్యం ఏంటో తెలుసుకోండి..