Viral Video: అమ్మో.. ఇదెక్కడి కోతిరా బాబు.. తన్నేసిందిగా.. పరేడ్ గ్రౌండ్స్‌లో కోతి చేసిన పని..

సోషల్ మీడియా అంటేనే ఓ సరదాల సమాహారం. అందులో వచ్చే అంశాలు కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని నవ్వించేట్టుగా ఉంటాయి. అలాంటివి చూస్తే అబ్బో..

Viral Video: అమ్మో.. ఇదెక్కడి కోతిరా బాబు.. తన్నేసిందిగా.. పరేడ్ గ్రౌండ్స్‌లో కోతి చేసిన పని..
Monkey Kick To Police
Follow us

|

Updated on: Jul 27, 2021 | 1:21 PM

సోషల్ మీడియా అంటేనే ఓ సరదాల సమాహారం. అందులో వచ్చే అంశాలు కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని నవ్వించేట్టుగా ఉంటాయి. అలాంటివి చూస్తే అబ్బో.. అని పిస్తుంటాయి. కొన్ని పెద్ద చర్చకు కారణంగా మారుతుంటాయి. అప్పుడు మనం చదువుతున్నది అంతకు మించి అని అనిపిస్తుంటుంది.. ఎందుకంటే ఇందులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఎపిసోడ్లో మరొక ఫన్నీ వీడియో భాగస్వామ్యం చేయబడింది. నన్ను నమ్మండి, మీ నవ్వును మీరు ఆపలేరు.

ఈ వీడియోలో ఒక కోతి (కొండముచ్చు) అలాంటి పనే చేసింది. ఇది చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతారు… నవ్వుకుంటున్నారు. ఎందుకంటే భారీ భద్రతావలంలోకి ఓ కోతి ఎంట్రీ ఇచ్చింది. అంతటితో ఆగకుండా అక్కడ జరగుతున్న కార్యక్రమంలో కోతి చేష్టలతో చెడగొట్టేసింది.

మీరు ఈ వీడియోలో..ఓ మైదానంలో పోలీస్ పరేడ్ జరుగుతోంది. పెద్ద సంఖ్యలో పోలీసులు కవాతు చేస్తున్నారు. స్టేడియంలో ఉన్న అతిధులు అంతా సీరియస్‌ చూస్తున్నారు. ఒక్కసారిగా ఓ కోతి ప్రత్యేక్షమైంది. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. ఓ కోతి చాలా వేగంగా వచ్చి కవాతుకు టీమ్ లీడర్‌గా ఉన్న ఓ పోలీసు అధికారికి భారీ కిక్ ఇచ్చింది. రెండు కాళ్లతో ఎగిరి తన్నేసింది. దీంతో చాలా క్రమ శిక్షణతో కవాతు చేస్తున్న పోలీస్ అధికారి తుళ్ళి పడ్డాడు. ఈ క్షణాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో చూడండి…

కోతి ఏం చేస్తుందిలే..

వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నవ్వడం ఆపలేరు. ఈ వీడియోను సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను భారత అటవీ సేవా అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోతో పాటు అతను ఫన్నీ కామెంట్‌ను జోడించారు. అదే సమయంలో  వినియోగదారులు కూడా ఈ వీడియోపై తీవ్రంగా సెటైర్లు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tirumala Electric Buses: తిరుమల టూ తిరుపతి

ఇది కూడా చదవండి: ఎలక్ట్రికల్ బస్సులు.. కొండలపై ఎకో ఫ్రెండ్లీ ప్రయాణం

ఇది కూడా చదవండి: Petrol Diesel Price: పట్టణవాసులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రో ధరలు..ఏపీలో మాత్రం..

ఇది కూడా చదవండి: Rivers overflowing: తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఉరుకులు.. పరుగులు.. నిండుకుండలా ప్రాజెక్టులు