Congress: పీకే అడుగు జాడల్లో కాంగ్రెస్.. రాజ్యసభకు పప్పు యాదవ్ భార్య.. JAP విలీనం కానుందా..?

గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని.. రంజిత్ రంజన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పొలిటికల్ హీట్ పెరిగింది.

Congress: పీకే అడుగు జాడల్లో కాంగ్రెస్.. రాజ్యసభకు పప్పు యాదవ్ భార్య.. JAP విలీనం కానుందా..?
Congress
Follow us

|

Updated on: May 31, 2022 | 10:07 PM

Congress – Prashant Kishor: 2024 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. దీనిపై ఇప్పటికే వ్యూహాలను అమలు చేస్తూ.. ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులుగా 10 మంది నేతల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో గాంధీ కుటుంబానికి చెందిన కొందరు విధేయుల పేర్లు ఉండగా.. మరికొందరి పేర్లు సీనియర్ నాయకులను సైతం అయోమయంలో పడేశాయి. బీహార్ నాయకుడు పప్పు యాదవ్ భార్య రంజీత్ రంజన్ (Ranjeet Ranjan) పేరును కాంగ్రెస్ చత్తీస్‌గఢ్‌ జాబితాలో చేర్చడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొంతమంది సీనియర్ నేతలకు తప్ప పెద్దగా తెలియని రంజీత్ రంజన్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ నామినేషన్ వేయడం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హీటెక్కిస్తోంది. ఆమె బీహార్ రాజకీయ నాయకుడు పప్పు యాదవ్ భార్య.. ఆమెతో కాంగ్రెస్ పార్టీ.. బీహార్‌లో పార్టీ విస్తరణ కోసం ఒప్పందం కుదుర్చుకుని ఉండవచ్చని తెలుస్తోంది.

భవిష్యత్తులో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఒంటరిగా వెళ్లాలన్న ప్రశాంత్‌ కిషోర్‌ సలహాతో కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోందని ఈ నిర్ణయంతో తెలుస్తోందని.. వ్యాసకర్త అజయ్ ఝా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన న్యూస్9కు ప్రత్యేక వ్యాసం రాశారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఆదివారం నాడు రాబోయే రాజ్యసభ ఎన్నికలకు 10 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో పార్టీకి చెందిన చాలా మంది నాయకుల పేర్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇందులో ఛత్తీస్‌గఢ్ అభ్యర్థిగా రంజిత్ రంజన్ పేరు కూడా ఉంది. రంజీత్ రంజన్.. జన్ అధికార్ పార్టీ అధినేత పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ భార్య. పప్పు యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మాజీ శిష్యుడిగా కూడా పేరు పొందారు. రంజీత్ రంజన్ మాజీ లోక్‌సభ ఎంపీ, ఆమె 2004 ఎన్నికలలో రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ నుంచి సహర్సా స్థానంలో గెలుపొందారు. 2014లో కూడా ఆమె సుపాల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఇవి కూడా చదవండి

గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని.. రంజిత్ రంజన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. భారత రాజకీయాల్లో తన బలహీన స్థితిని మెరుగు పరుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ నామినేషన్ల నుంచి వ్యూహాలను ప్రారంభించింది. వాస్తవానికి ఈ పార్టీకి ఇప్పుడు దాని ప్రత్యేక సభ్యులకు ప్రమోట్ చేయడానికి పరిమిత ఎంపికలు ఉన్నాయి. అందులో ఒకటి రాజ్యసభ సీటు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేతలకు లేదా పార్టీకి లేదా గాంధీ కుటుంబానికి సుదీర్ఘకాలం సేవలందించిన వారికి రాజ్యసభ లాంటి పదవులు దక్కుతాయి. రాజస్థాన్ నుంచి నామినేట్ అయిన రణదీప్ సింగ్ సూర్జేవాలా, హర్యానా నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ అయిన అజయ్ మాకెన్, ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ అయిన రాజీవ్ శుక్లా అలాంటి వారే.

సీనియర్ నాయకుల తరహాలో..

రంజీత్ రంజన్.. ఈ రెండు ప్రమాణాలకు అనుగుణంగా లేరు. అయినప్పటికీ ఆమె అనేక ఇతర అర్హులైన నాయకుల కంటే ముందుండి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని పొందగలిగారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆమె రాజ్యసభకు నామినేట్‌ కావడం డీల్‌లో భాగమేనని స్పష్టమవుతోంది. బీహార్‌ రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనంగా ఉద్భవించిన పప్పు యాదవ్‌ను రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరవచ్చు. వాస్తవానికి.. చేతిలో ఏకే-47 రైఫిల్‌తో కారు నడుపుతున్న పప్పు యాదవ్ చిత్రం ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతూనే ఉంది.

లాలూ మద్దతుతో..

బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నేరస్థులతో రాజకీయాలను శాసించడం ప్రారంభించినప్పుడు పప్పు యాదవ్ వెలుగులోకి వచ్చారు. ప్రజలు తమకు నచ్చిన విధంగా ఓటు వేయకండా.. షహాబుద్దీన్, పప్పు యాదవ్ వంటి నేరస్థులకు భయపడి ప్రజలు RJD కి ఓటు వేసేవారు. షహబుద్దీన్ 2021లో చనిపోయాడు, షహబుద్దీన్ 2007 నుంచి జైల్లో ఉన్నాడు జైలులోనే చనిపోయాడు. 1998లో సీపీఎం నేత అజిత్ సర్కార్ హత్య కేసులో పప్పు యాదవ్‌కు 2008లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే 2013లో పాట్నా హైకోర్టు ఈ కేసులో ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే ఇంత జరిగినా ఇప్పటికీ బాహుబలి లాంటి రాజకీయ నాయకుల్లో పప్పు యాదవ్ ఒకరు. అయితే ఆయనకు లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు ఎక్కువ కాలం లభించలేదు. దీంతో 2015లో లాలూ యాదవ్, పప్పు యాదవ్ మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన్ను ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత పప్పు యాదవ్ సొంతంగా జన్ అధికార్ పార్టీని స్థాపించారు.

అయితే, ఆయన భార్య రంజిత్ రంజన్ మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రంజిత్ రంజన్ కాంగ్రెస్ టిక్కెట్‌పై సుపాల్ నుంచి పోటీ చేసినప్పుడు.. పప్పు యాదవ్ తన భార్య కోసం బహిరంగంగా ప్రచారం చేశాడు. అయితే, ఆమె తన ప్రత్యర్థి జేడీయూకి చెందిన దిలేశ్వర్ కామత్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత RJD, కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి, RJD రంజీత్ రంజన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిందని ఆరోపించారు.

బీహార్‌లో పట్టు కోసం.. 

ఆర్‌జేడీతో తెగతెంపులు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ బీహార్ రాజకీయాల్లో తన మూలాలను మళ్లీ విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని బీహార్ నుంచి వస్తున్న నివేదికలు సూచిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే సూచన చేశారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (ఆర్జేడీ-కాంగ్రెస్) మహాకూటమి ఓటమికి కారణం గురించి కాంగ్రెస్ కు వివరించి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 144 స్థానాలకు గానూ ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మహాకూటమి కేవలం 12 సీట్లను మాత్రమే కోల్పోయింది. తరువాత RJD, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీపడిన కుశేశ్వరస్థాన్, తారాపూర్ స్థానాలకు 2021లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ రెండు స్థానాల్లో పోటీ చేసింది. అది కూడా రెండవ స్థానంలో ఉంది. అయితే ఉప ఎన్నికల వంతు రాగానే ఆర్జేడీ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది.

కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు. దానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ రెండు స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. రెండు పార్టీల మధ్య ఘర్షణ కారణంగా JDU ప్రయోజనం పొందింది. JDU ఈ రెండు స్థానాలను గెలుచుకోగలిగింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రంజీత్‌ రంజన్‌ రాజ్యసభకు నామినేట్‌ కావడం అనేది కాంగ్రెస్‌ పార్టీ బీహార్‌ భవిష్యత్తు వ్యూహంలో ఒక భాగమని ఇప్పటికి స్పష్టంగా అర్థమైంది. ఈ వ్యూహం ప్రకారం.. బీహార్‌లోని కాంగ్రెస్ పార్టీ పప్పు యాదవ్‌పై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో కోల్పోయిన రాజకీయ ప్రాబల్యాన్ని తిరిగి పొందడంలో అతని సహాయం కోరుతుందని అర్ధమవుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే 1990 తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ప్రభుత్వంలో లేదు. పప్పు యాదవ్ తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది.. అని అజయ్ ఝా పేర్కొన్నారు.

Link Source

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా