Rahul Gandhi: నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా.. బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ కౌంటర్

వివాహాలకు హాజరు కావడం సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమేనని, అదేం నేరం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా(Randeep Surjewala) వివరణ ఇచ్చారు. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పొరుగు దేశమైన...

Rahul Gandhi: నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా.. బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ కౌంటర్
Randeep Surjewala
Follow us

|

Updated on: May 03, 2022 | 4:34 PM

వివాహాలకు హాజరు కావడం సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమేనని, అదేం నేరం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా(Randeep Surjewala) వివరణ ఇచ్చారు. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పొరుగు దేశమైన నేపాల్​కు రాహుల్(Rahul) వెళ్లారని అన్నారు. శుభకార్యాలకు హాజరవడం ఇప్పటివరకైతే నేరమేమీ కాదని.. ఇకపై బీజేపీ ప్రభుత్వం దానిని కూడా చట్టవిరుద్ధంగా మారుస్తుందేమోనని ఎద్దేవా చేశారు. అలా జరిగితే స్నేహితులు, కుటుంబ సభ్యుల వివాహాలకు వెళ్లే సంప్రదాయాన్ని మార్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్​లో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఓ వీడియో సోషల్ మీడియాలో(Social Media) చక్కర్లు కొడుతోంది. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్ లీడర్లు విమర్శలకు కౌంటర్లు వేస్తున్నారు. నేపాల్ కాఠ్​మాండూలోని లార్డ్ ఆఫ్ రింగ్స్ క్లబ్​లో రాహుల్ గాంధీ.. జర్నలిస్టు ప్రెండ్ వివాహానికి హాజరయ్యారు. తన స్నేహితులతో కలిసి మారియట్‌ హోటల్‌లో బస చేశారు. ఈ వీడియోలో డిస్కో లైట్ల మధ్య చుట్టూ స్నేహితులతో రాహుల్ కనిపించారు. ఆయన చుట్టూ ఉన్నవారు ఆల్కహాల్ తాగుతున్నారు. ఈ వీడియో దేశ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.

రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు, ఫుల్ టైమ్ టూరిస్ట్ అని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. సాధారణ పౌరుడిగా పార్టీలకు వెళ్తే తప్పులేదని, కానీ రాహుల్ గాంధీ ఓ పార్లమెంట్ సభ్యుడిగా, ఓ జాతీయ పార్టీ అగ్రనేత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేస్తున్నది ఆయన వ్యక్తిగత విషయమని బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా అన్నారు. కానీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో హింస జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజస్థాన్ ఓ వైపు మండుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేయడానికి బదులు రాహుల్ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పార్టీలు చేసుకుంటున్నారు. అయితే భారతీయులతో కలిసి వారి సమస్యలను తెలుసుకోవాల్సిందిపోయి సరదా సంబరాల్లో మునిగితేలిపోయారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది. అందుకే రాహుల్ గాంధీ ఇలాగే నడుస్తుంది. ఆయన రాజకీయాల్లో సీరియస్ కాదు. తన పార్టీకి, దేశ ప్రజలకు అవసరమైనప్పుడు నేపాల్‌లో పార్టీ చేసుకుంటున్నారంటూ పూనావాలా విమర్శించారు.

ఈ వీడియోపై కాంగ్రెస్‌ స్పందిస్తూ బీజేపీకి కౌంటర్‌ ఇచ్చింది. ఓ మిత్ర దేశంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లడం నేరమేమీ కాదన్నారు. ప్రధాని మోదీ మాదిరిగా రాహుల్‌ గాంధీ ఏం పాకిస్థాన్‌లోని పిలవని వేడుకకు వెళ్లి నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా అని ప్రశ్నించింది. జర్నలిస్టు ఫ్రెండ్‌ వివాహానికి హాజరయ్యేందుకు మిత్ర దేశమైన నేపాల్‌ వెళ్లడంలో తప్పేం లేదని.. ఇదేం నేరం కాదని వెల్లడించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..

చైనా 73 ఏళ్లలో తొలిసారిగా మేడే జరుపుకోలేదు.. కారణం తెలిస్తే అదురుపుట్టడం ఖాయం!