AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణంలో స్పెషల్‌ డిజైన్‌.. అద్భుతాన్ని చూడబోతున్నారు.. అదేంటో తెలుసా..?

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ భక్తులు ఒక అద్భుతాన్నిచూడబోతున్నారు. ప్రతి రోజూ 5-10 నిమిషాలు సూర్య కిరణాలు రాముడి ..

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణంలో స్పెషల్‌ డిజైన్‌.. అద్భుతాన్ని చూడబోతున్నారు.. అదేంటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: May 03, 2022 | 3:20 PM

Share

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ భక్తులు ఒక అద్భుతాన్నిచూడబోతున్నారు. ప్రతి రోజూ 5-10 నిమిషాలు సూర్య కిరణాలు రాముడి నుదుటిపై బొట్టులా పడేలా నిర్మాణం చేపడుతున్నారు. ఈ విశేష నిర్మాణం గురించి రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వివరించారు. ఈ సందర్భంగా నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. శ్రీరాముడు నవమి రోజున జన్మించారు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించి ఉంటాడని ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. అందుకే ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఐదు నుంచి పది నిమిషాలు సూర్య కిరణాలు నేరుగా రాముడి విగ్రహంపై పడేలా నిర్మాణం చేస్తున్నాము అని అన్నారు. ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే బాధ్యతను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు అప్పజెప్పారు. అస్ట్రానమీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఈ కౌన్సిల్ నిపుణులు పూణెలో ఉంటారని, వారే దీని కోసం డిజైన్ చేశారని తెలిపారు. సౌర కుటుంబంలోని మార్పులు పరిగణలోకి తీసుకుని సుమారు 19 ఏళ్లు నిరాటంకంగా.. మధ్యాహ్నం పూట గర్భగుడిలోని రాముడి విగ్రహంపై సూర్య కిరణాలు పడేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారట. వారు గుడి నిర్మాణాలకు సంబంధించి వివరాలను తీసుకెళ్లి తమ రీసెర్చిని మొదలు పెట్టారు.

తొక్కిసలాట ముప్పు..

ఇక ఈ అద్భుతాన్ని చూడటానికి పెద్ద మొత్తంలో జనం ఆలయ ప్రాంగణంలో గుమిగూడే అవకాశం ఉంది. దీంతో భక్తుల నిర్వహణ సవాల్‌గా మారే ముప్పుగా మారబోతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఇతర చర్యలు తీసుకోబోతున్నట్టు నృపేంద్ర మిశ్రా వివరించారు. అందరూ ఈ అద్భుతాన్ని మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చూడాలని అనుకోవడం సహజం అని, ఒక వేళ వారంతా ఆలయ ప్రాంగణానికి వస్తే తొక్కిసలాట ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క సారిగా 75 వేల నుంచి ఒక లక్ష మంది భక్తులు గుడికి వస్తేగనుక వారిని ఆపడం సాధ్యం కాదని వివరించారు. అందుకే ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అయోధ్య వ్యాప్తంగా సుమారు 100 భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ స్క్రీన్లలో రాముడిపై సూర్య కిరణాలు నేరుగా పడే దృశ్యాలను చూపిస్తామని వివరించారు. తద్వార భక్తుల్లో కొంత ఉత్సుకతను నియంత్రణలో పెట్టడానికి ఈ స్క్రీన్లు ఉపకరిస్తాయని భావిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ అంచనాల ప్రకారం.. పీక్ డేస్‌లలో రామాలయం 12 గంటలు తెరిచే ఉంచితే.. సుమారు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు భక్తులు గుడికి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. అంటే.. ప్రతి వ్యక్తి ఏడు సెకండ్లలో దైవ దర్శనం చేసుకుని గుడి నుంచి బయటకు వెళ్లిపోతారని వివరించారు. ఈ సమయాన్ని, భక్తుల అనుభూతిని మరింత సుసంపన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు నృపేంద్ర మిశ్రా.

ఒడిశాలోని కోణార్క్​ సూర్య దేవాలయం స్ఫూర్తితో అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్​ వర్గాలు ఇదివరకే తెలిపాయి. అయితే ప్రారంభంలో ప్రతి శ్రీరామ నవమి రోజున గర్భగుడిలోని రాముని విగ్రహంపై సూర్య కిరణాలు పడే విధంగా నిర్మాణానికి ప్లాన్‌ చేశారు. అయితే ఇప్పుడు ప్రతి రోజూ ఈ అధ్భుతం ఆవిష్కృతమయ్యేలా నిర్మాణ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి అద్భుతం రోజు ఉండేలా శాస్త్రవేత్తలు, జ్యోతిషులు, సాంకేతిక నిపుణులు ఈ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మందిర నిర్మాణంలో సాంకేతిక అంశాలపై పని చేసేందుకు నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​బిల్డింగ్ కన్​స్ట్రక్షన్​సహా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ముంబైకి చెందిన నిపుణులతో .. కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోపక్క ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్​కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి కల్పించనున్నట్లు తెలిపారు. అయితే 1000 సంవత్సరాల ఆల‌యం చెక్కుచెద‌ర‌కుండా ఉండే విధంగా ఆలయ నిర్మాణ‌ ఉండేలా చేస్తున్నామని అన్నారు.

కోణార్క్, అరసవెల్లి సూర్య దేవాలయాల్లో కూడా..

దేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కోణార్క్‌ ఆలయంలో సూర్య కిరణాలు మూల విరాట్టుని తాకే విధంగా నిర్మాణ శైలి ఉంటుంది. కోణార్క్ ఆలయంలో సూర్యోదయం తర్వాత తొలి సూర్యకిరణం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా నిర్మాణం చేశారు. అలాగే గుజరాత్‌లోని మోధేరా సూర్య దేవాలయంలో సూర్యోదయ సమయంలో కిరణాలు గర్భగుడిలో ప్రసరిస్తాయి.

అలాగే ఏపీలో.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోకూడా ఏడాదికి రెండుసార్లు ఇటువంటి దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఒకసారి.. మార్చి నెలలో సూర్యుడు దక్షణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో, రెండోసారి.. అక్టోబర్‌ నెలలో ఉత్తరాయణం నుంచి దక్షణాయనంలో ప్రవేశించే సమయంలో ఈ సూర్యకిరణాలు తాకుతాయి. సూర్య కిరణాలు గర్భగుడిలో స్వామివారి మూల విరాట్టు పాదాల నుంచి శిరస్సు వరకూ తాకుతాయి. ఆయా రోజుల్లో ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PM Modi Visit: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ బిజీ బిజీ.. యూరఫ్ తర్వాత నేపాల్, జపాన్‌ సందర్శించే అవకాశం

KALIA Scheme: రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్థికంగా ఆదుకునేందుకు కొత్త పథకం