ఈ పరిస్థితికి మీదే బాధ్యత’, ఆక్సిజన్ కొరత, రోగుల మృతిపై కేంద్రాన్ని దుయ్యబట్టిన రాహుల్ గాంధీ
దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. వందలాదిగా కోవిడ్ రోగులు మరణిస్తున్నారు. ఈ పరిస్థితికి మీదే బాధ్యత అని కాంగ్రెస్ నేత
దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. వందలాదిగా కోవిడ్ రోగులు మరణిస్తున్నారు. ఈ పరిస్థితికి మీదే బాధ్యత అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు. మీకు ముందు చూపు లేదన్నారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 3.32 లక్షలకు చేరుకోగా గత 24 గంటల్లో 2,263 మంది మృతి చెందారు. కోవిడ్ ఓ రోగి ఆక్సిజన్ లెవెల్స్ ని తగ్గిస్తుందని, ఇదే సమయంలో హాస్పిటల్స్ లో తగినంత ఆక్సిజన్ గానీ, బెడ్లు గానీ లేకపోవడం వల్ల రోగులు మరణిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇందుకు బాధ్యత ఎవరిదీ..మీది కాదా అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాహుల్ కూడా కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో గంగారాం తదితర హాస్పిటల్స్ లో దారుణ పరిస్థితి నెలకొంది. గంటగంటకూ తగ్గుతున్న ఆక్సిజన్ నిల్వలు, పెరిగిపోతున్న రోగులతో పలు ఆసుపత్రి యజమాన్యాలు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చివరకు ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే భరద్వాజ్ సైతం నిన్న తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి బెడ్ పై నుంచే ఓ వీడియో విడుదల చేస్తూ తన దీన స్థితిని వెల్లడించారు. ఈతరాని వారిని చెరువులోకి తోసివేస్తే ఎలా ఉంటుందో అలా తన పరిస్థితి ఉందని, కేంద్రం, హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి ఆక్సిజన్ ని సరఫరా చేయాలని ఆయన అభ్యర్థించారు. తమ ఆసుపత్రిలో మరో 3 గంటలు మాత్రమే ఆక్సిజన్ ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గంగారాం ఆసుపత్రి యాజమాన్యమయితే.. తమ హాస్పిటల్ లో గత 24 గంటల్లో 25 మంది రోగులు మృతి చెందినట్టు పేర్కొంది. కాగా నగరంలోని ఇతర ఆసుపత్రులు కూడా ఇంచుమించు ఇదే విధమైన దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
Corona can cause a fall in oxygen level but it’s #OxygenShortage & lack of ICU beds which is causing many deaths.
GOI, this is on you.
— Rahul Gandhi (@RahulGandhi) April 23, 2021