Shama Mohamed: షమా మహమ్మద్ కామెంట్స్‌పై దుమారం.. ఇరకాటంలో కాంగ్రెస్
కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత షామా మహమ్మద్ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఈ వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చి చొరబడ్డాయి. షమా మహమ్మద్ కామెంట్స్‌పై బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అటు షమా మహమ్మద్ ట్వీట్‌పై BCCI కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయంలో కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ నేతల విమర్శలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కాంగ్రెస్ నాయకురాలు చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షామా మహమ్మద్ చేసిన ట్వీట్‌పై అటు సోషల్ మీడియాలో విమర్శలు, ఇటు బీజేపీ నేతల కౌంటర్లతో ఫిట్‌నెస్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి.ప్లేయర్ ఫిట్‌నెస్ గురించి మాత్రమే చెప్తూ ఆ ట్వీట్ చేశానన్నారు కాంగ్రెస్ నాయకురాలు షమా మహమ్మద్. అది బాడీ షేమింగ్ కాదని.. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలని తాను నమ్ముతానన్నారు.
షమా మహమ్మద్ కామెంట్స్‌పై బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మ్యాచ్‌లు గెలుస్తున్నామని.. పాకిస్థాన్‌ను కూడా ఓడించామని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా గుర్తుచేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో 93 ఎన్నికలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
షమా మహమ్మద్ ట్వీట్‌పై BCCI కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక టోర్నీ మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని… వ్యక్తిగత ప్రచారం కోసం కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




