Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil K Antony: కాంగ్రెస్‌కు ఎకే ఆంటోనీ కుమారుడు అనిల్ రాజీనామా.. ప్రధాని మోడీపై విద్వేషం తగదంటూ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ పార్టీ చేసిన ‘ట్విట్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ పార్టీకి రాజీనామా చేశారు.

Anil K Antony: కాంగ్రెస్‌కు ఎకే ఆంటోనీ కుమారుడు అనిల్ రాజీనామా.. ప్రధాని మోడీపై విద్వేషం తగదంటూ..
Anil K Antony
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 25, 2023 | 11:18 AM

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత తనయుడు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని  కాంగ్రెస్ పార్టీ  చేసిన ‘ట్విట్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ నిర్ణయంపై అసహనం వ్యక్తంచేస్తూ బుధవారం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ప్రధాని మోదీని విమర్శించే డాక్యుమెంటరీపై ఆందోళన వ్యక్తంచేసిన అనిల్ కె ఆంటోనీ.. పార్టీ తీరు బాధకలిగించిందని.. అందుకే కాంగ్రెస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇలాంటివి రాజకీయాల్లో తగదంటూ అనిల్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఈ మేరకు అనిల్ ట్వీట్ చేశారు.

కేరళ కాంగ్రెస్ లోని తన పదవులన్నింటికీ రాజీనామా చేశానని ఈ సందర్భంగా ప్రకటించారు. వాక్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాంగ్రెస్.. వారి ట్వీట్‌ను ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చానని.. కానీ దానిని వారు నిరాకరించినట్లు తెలిపారు. ఇది ద్వేషం, దుర్వినియోగం, వంచనకు పరాకాష్ట అని తెలిపారు. ఈ మేరకు అనిల్ తన రాజీనామా లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు.

2002 గుజరాత్ అల్లర్లపై ప్రధాని మోడీపై రూపొందించిన డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించాయి. దీంతో ఈ నిర్ణయంపై అనిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీబీసీ డాక్యుమెంటరీ దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడమే అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశంపై బీబీసీ సుదీర్ఘ కాలంగా పక్షపాతాన్ని చూపుతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా.. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం సైతం ఆంక్షలు విధించింది. ఇది దేశ సార్వభౌమత్వాన్ని మంటగలిపే విధంగా ఉందని.. ఇప్పటికే పలు ట్వీట్లను డిలిట్ చేయడంతోపాటు యూట్యూబ్ నుంచి ఆ వీడియోలను తొలగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..