Metro: మెట్రో స్టేషన్‌లో కనిపించిన బాక్స్.. తెరిచి చూడగా షాకైన ప్రయాణికుడు!
Metro Station: మెట్రోలో రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. కొందరు ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు పోగొట్టుకుంటారు. కానీ ఈ మెట్రో స్టేషన్‌లో మాత్రం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దీనిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. స్టేషన్ గేట్ వెనుక ఓ బాక్స్ కనిపించింది. అది తెరిచి చూడగా..

Metro Stations: ఢిల్లీ మెట్రో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటుంది . అయితే , ఇప్పుడు ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమవుతోంది. ఇందులో , ఒక ప్రయాణికుడు కండోమ్‌లతో నిండిన పెట్టెను గుర్తించాడు. ఫోటోకు ఫన్నీ రియాక్షన్లు వస్తున్నాయి. అయితే , కండోమ్‌లతో నిండిన ఈ పెట్టెను మెట్రోకు ఎవరు? ఎక్కడి నుండి తీసుకువచ్చారు ? ఇది ఇంకా తెలియదు . అయితే , నెటిజన్లు ఈ విషయంపై ఫన్నీ రియాక్షన్లు ఇస్తూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Horoscope: ఈ వారంలో ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? ఈ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి!
ఢిల్లీ మెట్రోలో రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. కొందరు ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు పోగొట్టుకుంటారు. కానీ ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మాత్రం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దీనిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. స్టేషన్ గేట్ వెనుక ఓ కండోమ్ బాక్స్ కనిపించింది. అది తెరిచి చూడగా అందులో చాలా కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి రెడిట్‌లో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. కండోమ్ ప్యాకెట్లలో మూడు ఒపెన్ అయినట్లు కూడా ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
కండోమ్ ప్యాకెట్లపై స్పందించిన ఢిల్లీ మెట్రో:
ఈ కండోమ్ ప్యాకెట్లపై ఢిల్లీ మెట్రో స్పందించింది. ప్రజారోగ్య ప్రచారంలో భాగంగా కండోమ్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించిందని, అందుకే అక్కడ లభించి ఉండవచ్చని తెలిపింది.
అది పటాకుల పెట్టె అనుకున్నా: నెటిజన్
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కనిపించేని కండోమ్ బాక్స్‌ను ముందుగా చూసి పటాకుల పెట్టె అనుకున్నానని, తెరిచి చూడగా, అది కండోమ్ బాక్స్ ఉందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ కండోమ్‌లను గతంలో బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఉచితంగా పంపిణీ చేసేవారు. ఇప్పుడు మెట్రో స్టేషన్‌లో లభించిందని చెప్పుకొచ్చాడు మరో నెటిజన్.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Posts from the delhi community on Reddit
ఢిల్లీ మెట్రో నిరోధ్‌తో భాగస్వామ్యం
2014లో గర్భనిరోధకాల తయారీలో అతిపెద్ద సంస్థ అయిన HLL లైఫ్‌కేర్, వివిధ మెట్రో స్టేషన్లలో వెండింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేయడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ యంత్రాలను నిరోధ్ కండోమ్‌లతో పాటు శానిటరీ న్యాప్‌కిన్‌లు వంటి ఇతర ఆరోగ్య ఉత్పత్తులను అమ్మడానికి ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: EPFO Pension Rule: మీరు పదేళ్ల తర్వాత ఒక కంపెనీని వదిలివేస్తే పెన్షన్ వస్తుందా? నియమాలు ఏంటి?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








