AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justice Surya Kant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. న్యాయశాఖకు సీజేఐ గవాయ్ సిఫారసు..

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నవంబర్ 24 న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.. ఈ మేరకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్.. తదుపరి CJI గా జస్టిస్ సూర్యకాంత్ పేరును న్యాయ శాఖకి సిఫార్సు చేసారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ గా ఉన్న న్యాయమూర్తి సీజేఐ బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది..

Justice Surya Kant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. న్యాయశాఖకు సీజేఐ గవాయ్ సిఫారసు..
Justice Surya Kant, CJI BR Gavai
Gopikrishna Meka
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 27, 2025 | 12:12 PM

Share

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నవంబర్ 24 న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.. ఈ మేరకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్.. తదుపరి CJI గా జస్టిస్ సూర్యకాంత్ పేరును న్యాయ శాఖకి సిఫార్సు చేసారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ గా ఉన్న న్యాయమూర్తి సీజేఐ బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది.. ప్రస్తుత సీజేఐ BR గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్‌ను CJIగా సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.. జస్టిస్ సూర్యకాంత్ మే 24, 2019న నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.. జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 9, 2027 వరకు.. 14 నెలలకు పైగా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయనున్నారు.

హర్యానాకి చెందిన జస్టిస్ సూర్యకాంత్..

ఫిబ్రవరి 10, 1962న హర్యానాలోని హిసార్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి జస్టిస్ కాంత్.. 1981లో హిసార్‌లోని ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు.1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 1984లో హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జస్టిస్ కాంత్.. మార్చి 2001లో ఆయన సీనియర్ న్యాయవాదిగా నియామకమయ్యారు.. అనంతరం జనవరి 9, 2004న పంజాబ్ హర్యానా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్టోబర్ 5, 2018 నుండి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు.. 2019 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. గవాయ్ తర్వాత భారత 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కొనసాగనున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కీలక తీర్పులు వెలువరించిన జస్టిస్ సూర్యకాంత్

జస్టిస్ సూర్యకాంత్ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అనేక ముఖ్యమైన తీర్పులు వెలువరించారు. అనేక సున్నితమైన సామాజికంగా ముఖ్యమైన కేసులలో తీర్పులు ఇచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక న్యాయం, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కీలకంగా ఉన్నాయి. అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2020) కేసులో జస్టిస్ సూర్యకాంత్ జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌పై తీర్పు ఇచ్చారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఒక ప్రాథమిక హక్కు అని, దానిని నిరవధికంగా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు డిజిటల్ హక్కులకు సంబంధించి ఒక మైలురాయిగా నిలిచింది.

కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) పర్యావరణ సంబంధిత కేసులో, జస్టిస్ సూర్యకాంత్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కఠిన చర్యలను సమర్థించారు. ఈ కేసులో కాలుష్య నియంత్రణ స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించారు. మహిళా హక్కులు, సామాజిక న్యాయం సంబంధించి జస్టిస్ సూర్యకాంత్ అనేక కేసులలో మహిళల హక్కులు, లింగ సమానత్వం, సామాజిక న్యాయంపై కీలక తీర్పులు ఇచ్చారు.. లైంగిక వేధింపులు గృహ హింసకు సంబంధించిన చట్టాల అమలుపై కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. రాజ్యాంగ సంబంధిత కేసులలో రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే తీర్పులు ఇచ్చారు. పౌరసత్వం, ప్రైవసీ హక్కు, మత స్వేచ్ఛ వంటి అంశాలపై ఆయన తీర్పులు కీలకంగా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..