Railway Jobs 2025: రైల్వేలో గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా..? సిలబస్, ఎంపిక విధానం ఇదే
రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్‌టీపీసీ) గ్రాడ్యుయేట్ విభాగంలో రైల్వే ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,810 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులను..

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్‌టీపీసీ) గ్రాడ్యుయేట్ విభాగంలో రైల్వే ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,810 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు 161, స్టేషన్ మాస్టర్ పోస్టులు 615, గూడ్స్ ట్రెయిన్ మేనేజర్ పోస్టులు 3416, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 638, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను నవంబర్ 20, 2025వ తేదీలోపు స్వీకరిస్తారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం ఇలా..
అన్ని పోస్టులకూ రెండు దశల్లో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ) అదనంగా ఉంటుంది. ఇక జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్టు (సీబీటీఎస్‌టీ)లో అర్హత పొందాల్సి ఉంటుంది. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది జాబితాను వెల్లడిస్తారు.
స్టేజ్ 1 రాత పరీక్ష ఇలా..
ఈ దశలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో అర్హత పొందిన వారిని మాత్రమే స్టేజ్ 2కి అనుమతిస్తారు.
స్టేజ్ 2 రాత పరీక్ష ఇలా..
కేటగిరీల వారీ ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్ 2 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఈ పరీక్ష మొత్తం 120 మార్కులకు, 120 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 35 ప్రశ్నలు చొప్పున వస్తాయి. ఇందులోనూ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఆర్ఆర్బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ రెండు దశల్లో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యుఎస్ 40, ఓబీసీ ఎన్‌సీఎల్, ఎస్సీ 30, ఎస్టీ 25 శాతం చొప్పున మార్కులు పొందాలి. రెండు దశల్లోనూ ప్రతి తప్పు సమాధానానికీ 1/3 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ ఎంపికలో స్టేజ్ 2 పరీక్ష స్కోరుకు 70 శాతం, సీబీఏటీకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్టు ఉంటుంది. ఇంగ్లిష్‌లో అయితే నిమిషానికి 30, హిందీలో 25 పదాలు టైప్ చేయగలగాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. పరీక్ష తేదీ ప్రకటించలేదు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




