SP Velumani: అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో అక్రమాలు.. రూ.1,500 కోట్లు స్వాహా.. ప్రజాధనాన్ని కాజేశారని మంత్రిపై ఆరోపణలు..!

మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేని ఎస్పీ వేలుమణి అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు.

SP Velumani: అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో అక్రమాలు.. రూ.1,500 కోట్లు స్వాహా.. ప్రజాధనాన్ని కాజేశారని మంత్రిపై ఆరోపణలు..!
Tamil Nadu Ex Minister Sp Velumani
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 28, 2021 | 5:06 PM

Complaint file on Tamilnadu Ex Minister SP Velumani: మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేని ఎస్పీ వేలుమణి అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కోయంబత్తూరు ఆర్థిక నేర విభాగం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. కోయంబత్తూరుకు చెందిన డీఎంకే సభ్యుడు, సినీ నిర్మాత ‘రేస్‌కోర్స్‌’ రఘునాథ్‌ కోవై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న క్రైం బ్రాంచి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్‌తో పాటు పక్కనున్న మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు కలిసి ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోయంబత్తూరు కార్పొరేషన్‌లో రూ.1,500 కోట్లతో చేపట్టిన అవినాశీ–అత్తికడవు పథకానికి తొలివిడతగా రూ.225 కోట్లు మంజూరయ్యాయి. నొయ్యాల్‌ చెరువు స్వాధీనం కోసం రూ.230 కోట్లు, కోవై నగరానికి 24 గంటల తాగునీటి సరఫరాకు రూ.550 కోట్లు, కునియముత్తూరు భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.19.5 కోట్లు, ఆత్తుపాలం–ఉక్కడం ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులకు రూ.215.51 కోటి, కోవై రేస్‌కోర్సు స్మార్ట్‌ సిటీ పథకానికి తొలివిడతగా రూ.40 కోట్లు కేటాయింపు జరిగింది.

ఇలా కోవైలో జరిగే అన్ని పనులకు మంత్రి తన వాటాగా 12 శాతం కమీషన్‌ తీసుకున్నారని రఘునాథ్ కోవై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా వివిధ పథకాల ముసుగులో రూ.1,500 కోట్ల వరకు మాజీ మంత్రి వేలుమణి అవినీతికి పాల్పడినట్లు రఘునాథ్‌ కోవై ఆరోపించారు. వేలుమణిపై అవినీతి నిరోధకశాఖ ద్వారా చట్టపరమైన చర్య తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ధనాన్ని అపన్నంగా కాజేసిన వారిని వదిలిపెట్టకూడదని కోరారు.

Read Also…  Karnataka Cabinet: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తొలి కేబినెట్ సమావేశం.. మొదటి నిర్ణయం ఏం తీసుకున్నారంటే..?