Monkey Menace: రెండేళ్లుగా గేటెడ్ కమ్యూనిటీలోనే కోతులు పాగా.. స్థానికులకు ప్రత్యక్ష నరకం..

కోయంబత్తూరు నగరంలో రేస్‌ కోర్స్‌లోని రహేజా ఎన్‌క్లేవ్‌లోని ఫ్లాట్‌లలోకి కోతుల బృందం ప్రవేశించి తమ ఇంట్లో ఉన్న ఆహార పదార్ధాలను దొంగిలించడం ప్రారంభించాయని తమని ఆ కోతుల బారి నుంచి రక్షించమని విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే అటవీ శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల కనీసం ముగ్గురిపై కోతులు దాడి చేశాయని.. కనుక కోతుల దాడి నుంచి తమ రక్షించేందుకు వాటిని బంధించి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

Monkey Menace: రెండేళ్లుగా గేటెడ్ కమ్యూనిటీలోనే కోతులు పాగా.. స్థానికులకు ప్రత్యక్ష నరకం..
Monkey Hulchul In CoimbatorImage Credit source: Special Arrangement
Follow us

|

Updated on: Jul 16, 2024 | 11:19 AM

అడవులు దగ్గర ఉన్న పల్లెల్లో లేదా పంట పొలాలు దగ్గర ఉన్న ప్రాంతాల్లో కోతుల బెడద గురించి.. అవి పెట్టె తిప్పల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో కూడా కోతుల బృందం ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయని.. రెండేళ్ళ నుంచి తమని ఇబ్బంది పెడుతున్నాయని.. తమను ఆ కోతుల బారిన నుంచి కాపాడమని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు లోని కోయంబత్తూరు నగరంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న రేస్‌ కోర్స్‌లోని రహేజా ఎన్‌క్లేవ్‌లోని ఫ్లాట్‌లలోకి కోతుల బృందం ప్రవేశించి తమ ఇంట్లో ఉన్న ఆహార పదార్ధాలను దొంగిలించడం ప్రారంభించాయని తమని ఆ కోతుల బారి నుంచి రక్షించమని విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే అటవీ శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల కనీసం ముగ్గురిపై కోతులు దాడి చేశాయని.. కనుక కోతుల దాడి నుంచి తమ రక్షించేందుకు వాటిని బంధించి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు సంవత్సరాల క్రితం నగరం నడిబొడ్డున ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలోకి ఏడు కోతులు రావడం ప్రారంభించాయి. అక్కడ ఉన్న ఆహారం తీసుకుని తినడం ప్రారంభించి.. నెమ్మదిగా ఈ కోతులు గేటెడ్ కమ్యూనిటీ ఆవరణలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోకి తరచూ ఈ కోతులు వెళ్లి అక్కడ ఉన్న ఆహారాన్ని దొంగిలించి తింటున్నాయి. అంతేకాదు ఫ్లాట్లలోకి ప్రవేశించి హల్ చల్ చేస్తున్నాయి. ఆవరణలో ఉన్న పిల్లలను వెంబడించి కోతులు ప్లాట్ లో నివసించే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.

కోతులను బంధించడానికి బోను ఏర్పాటు చేసిన అటవీ శాఖ

కోతుల బెడద కారణంగా కిటికీలు, తలుపులు తెరవలేకపోతున్నామని ప్లాట్ లో నివసించే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతులు ఫ్లాట్‌లలోకి రాకుండా ఉండేందుకు తమ బాల్కనీలను వలలతో కవర్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ కోతులు ఆ వలలను పాడు చేసి.. తద్వారా లోపలికి వస్తున్నాయని.. ఆహారం కోసం మనుషులపై కూడా దాడులు చేస్తున్నాయని ప్లాట్ లో నివసిస్తున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదపై అటవీ శాఖ కార్యాలయాన్ని సందర్శించి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే ధనన్ తెలిపారు. అయినా కోతులను పట్టుకునేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయంపై కోయంబత్తూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తిరుమురుగన్ స్పందిస్తూ కోతులకు ప్రజలు ఆహారం ఇచ్చి.. వాటికి ఆహారాన్ని అలవాటు చేశారని.. దీంతో అప్పటి నుంచి ఆహారం కోసం కోతులు గేటెడ్ కమ్యూనిటీలో స్థిరపడ్డాయని చెప్పారు. ఆహారం ఇవ్వడానికి ఇష్టపడక పొతే అప్పుడు కోతులు దూకుడు ప్రదర్శించి దాడులు చేస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే ప్లాట్ లో నివసిస్తున్న వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించామని చెప్పారు. ఇప్పటికే అటవీ శాఖ తో కలిపి పోలీసు డిపార్ట్‌మెంట్ కోతులను ట్రాప్ చేయడానికి బోనులను ఏర్పాటు చేసిందని అన్నారు. వాటిని కోతులను బందిస్తామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2ఏళ్లుగా గేటెడ్ కమ్యూనిటీలో కోతులు పాగా స్థానికులకు ప్రత్యక్షనరకం
2ఏళ్లుగా గేటెడ్ కమ్యూనిటీలో కోతులు పాగా స్థానికులకు ప్రత్యక్షనరకం
వామ్మో.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర..
వామ్మో.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానన్న వార్నర్.. షాక్ ఇచ్చిన సెలెక్టర్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానన్న వార్నర్.. షాక్ ఇచ్చిన సెలెక్టర్లు
'సారూ..బతికేఉన్న! సచ్చిపోయినానని సర్కారోళ్లు పింఛన్‌ ఇస్తలేరయ్యా'
'సారూ..బతికేఉన్న! సచ్చిపోయినానని సర్కారోళ్లు పింఛన్‌ ఇస్తలేరయ్యా'
యాపిల్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తినడానికి సమయం ఉందని తెలుసా
యాపిల్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తినడానికి సమయం ఉందని తెలుసా
నిద్రమత్తులో రైల్లోంచి జారిపడ్డ భార్య ! కాపాడబోయిన భర్త.. చివరికి
నిద్రమత్తులో రైల్లోంచి జారిపడ్డ భార్య ! కాపాడబోయిన భర్త.. చివరికి
మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా ??
మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా ??
10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు
10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు
నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురు సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్
నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురు సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్
1000 కోట్ల క్లబ్‌లో 'కల్కి'.. భాజా భజంత్రీలతో ఫ్యాన్స్ సంబరాలు
1000 కోట్ల క్లబ్‌లో 'కల్కి'.. భాజా భజంత్రీలతో ఫ్యాన్స్ సంబరాలు